శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (11:32 IST)

బెంగుళూరులో సరికొత్త వివాదం : బైబిల్ గ్రంథానికి నో ఎంట్రీ

bible
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన కర్నాటక వివాదాస్పాలకు కేంద్రంగా మారుతోంది. ఇటీవలే హిజాబ్ వివాదం చెలరేగింది. ఇది దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. న్యాయస్థానం జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగిపోయింది. ఇపుడు మరో వివాదం చెలరేగింది. 
 
బెంగుళూరు క్లారెన్స్ హైస్కూల్‌లో పవిత్ర గ్రంథం బైబిల్‌ను పాఠశాల ప్రాంగణంలోకి తీసుకెళ్లడానికి తమ పిల్లలకు అభ్యంతరం లేదని తల్లిదండ్రుల నుంచి హమీ తీసుకుంది. దీనిపై రైట్ వింగ్ హిందూ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందూ జన జాగరణ్ సమితి పాఠశాల చర్యను వ్యతిరేకించంది. పాఠశాల హిందూయేతర విద్యార్థులను బైబిల్ చదవాలని బలవంతం చేస్తుందని సంస్థ ప్రతినిధి మోహన్ గౌడ్ ఆరోపించారు.
 
మరోవైపు, పాఠశా యాజమాన్యం తమ చర్యను సమర్థించుకుంది. పాఠశాల బైబిల్ విద్యను అందజేస్తుందని తెలిపారు. పాఠశాలలో క్రైస్తవేతర విద్యార్థులు కూడా ఉన్నారని, వారిపై బైబిల్‌లోని బోధనలను బలవంతంగా నేర్చుకునేలా ఒత్తిడి చేస్తున్నారని హిందూ జన జాగృతి పేర్కొంది.