శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

మొబైల్ ఫోన్ చోరీకి శిక్షణ - నెలకు రూ.25 వేల వేతనం... ఎక్కడ?

mobile massage
మొబైల్ ఫోన్ చోరీకి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అంతేనా.. నెలకు రూ.25 వేతనం కూడా ఇస్తారు. ఈ మొబైల్ చోరీలో పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ 45 రోజుల పాటు వారే శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత రద్దీ ప్రాంతాలను చూసుకుని మొబైల్స్ దొంగతనం చేసి ఇస్తే చాలు.. నెలకు రూ.25 వేలు చొప్పున వేతనం అందిస్తారు. ఈ మొబైల్ చోరీలకు శిక్షణ ఇచ్చేది.. ఎక్కడో కాదు.. సాక్షాత్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో ఇస్తున్నారు. ఈ దందా గత కొంతకాలంగా యధేచ్చగా సాగుతుండగా, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ షాకింగ్ విషయం వెలుగు చూసింది. 
 
చోరీ చేసిన మొబైల్స్‌ను ముఠా నిర్వాహకులు అన్‌లాక్ చేసి బంగ్లాదేశ్, నేపాల్ పంపి సొమ్ము చేసుకుంటారు. నిందితులను సూరత్‌కు అవినాశ్ మహతో (19), శ్యామ్ కుర్మి (26)గా గుర్తించారు. వారి నుంచి రూ.58 మొబైల్స్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 29 ఐఫోన్లు, 9 వన్ ప్లస్ ఫోన్లు ఉన్నాయి. వీటి విలువ రూ.20 లక్షలు పైమాటేనని పోలీసులు తెలిపారు. కాగా, ఈ నిందితులు అవినాశ్, శ్యామ్ ఇద్దరూ జార్ఖండ్ రాష్ట్రంలో కూలీలుగా పనిచేస్తున్నారు. కాగా, ఈ చోరులు అహ్మదాబాద్, గాంధీ నగర్, వడోదర, ఆనంద్, రాజ్‌కోట్ వంటి ప్రాంతాల్లో మొబైల్స్ దొంగతనం చేసేవారని, ఇందుకు సంబంధించి 19 ఫిర్యాదులు అందినట్టు పోలీసులు విచారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నారు.