గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 జనవరి 2024 (11:04 IST)

ఢిల్లీ పోలీస్ ట్రైనింగ్ స్కూలులో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన..?

Delhi
Delhi
ఉత్తర ఢిల్లీలోని వజీరాబాద్‌లో ఉన్న ఢిల్లీ పోలీస్ ట్రైనింగ్ స్కూల్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది, ఇందులో యార్డ్‌లో ఉంచిన 450 వాహనాలు దెబ్బతిన్నాయి. మంటలను ఆర్పేందుకు ఎనిమిది ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ విభాగం తెలిపింది.  
 
ఢిల్లీలోని వజీరాబాద్‌లోని పోలీసు శిక్షణ పాఠశాలలో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక శాఖకు చెందిన 8 వాహనాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తెల్లవారుజామున 4:15 గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారని అధికారులు తెలిపారు. దాదాపు 200 నాలుగు చక్రాల వాహనాలు, 250 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.