Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

జూన్ ఒకటో తేదీ నుంచి మారిన నింబంధనలు ఏంటో తెలుసా?

Written By ఠాగూర్
Updated: గురువారం, 1 జూన్ 2023 (10:45 IST)
2023 సంవత్సరంలో మరో నెల చరిత్రపుటల్లో కలిసిపోయింది. మే నెల విజయంతంగా ముగిసింది. జూన్ నెల ఆరంభమైంది. అయితే, ఈ నెల ఒకటో తేదీ నుంచి పలు నిబంధనలు మారనున్నాయి. అంటే, కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. జూన్ ఒకటో తేదీన వాణిజ్య సిలిండర్ ధరను చమురు కంపెనీలు తగ్గించాయి. కానీ గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. 
 
అలాగే, జూన్ ఒకటో తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆధార్ కార్డుల్లో ఉన్న తప్పొప్పులను ఎలాంటి రుసుం లేకుండా సరిచేసుకునేందుకు యూఐడీఏఐ అవకాశం కల్పించింది. పేరు, అడ్రస్ వంటి వాటి వివరాలను ఆన్‌లైన్ ద్వారా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. అయితే, ఈ అవకాశం ఈ నెల 14వ తేదీ వరకు మాత్రమే. ఆ తర్వాత ఆన్‌లైన్ ద్వారా చేసినా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
 
బ్యాంకు ఖాతాల్లోనే అన్‌క్లైయిమ్‌‍డ్ డిపాజిట్లను క్లియర్ చేసేందుకు భారత రిజర్వు బ్యాంకు చర్యలు చేపట్టింది. ఎఫ్.డి, సేవింగ్స్, కరెంట్ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేసి తిరిగి క్లెయిమ్ చేసుకోని వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి నామినీ కోసం ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్ చేయని వారిని గుర్తించి, వారి కుటుంబ సభ్యులకుగానీ, నామినీలకు గాను డబ్బులు చెల్లించాలని ఆదేశించింది. జూన్ ఒకటో తేదీ నుంచి వంద రోజుల పాటు ఈ పథకం కొనసాగనుంది. 
 
పిల్లల పేరుపై కొత్త ఖాతా ఓపెన్ చేయకుండానే పిల్లల పేర్లపై మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌లో డబ్బులు పెట్టుబడిగా పెట్టొచ్చు. మార్కెట్ రెగ్యులేటర్ సంస్థ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధన ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. వాహనదారులకు కేంద్రం షాకిచ్చింది. ఎలక్ట్రిక్ స్కూటర్, బైక్ కొనుగోలు చేయాలనుకునేవారికి జూన్ ఒకటో తేదీ నుంచి భారీ షాక్ తగలనుంది. కేంద్రం అందిస్తూ వచ్చిన సబ్సీడీలో భారీ కోత విధించనుంది. ఇలాంటి వాటితో పాటు అనేక కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం