శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 2 మార్చి 2017 (06:46 IST)

జైలు, పార్టీ పదవి నుంచి గట్టెక్కించాలన్న ధ్యాస ఉందా : జైల్లో మంత్రులకు తలంటిన శశికళ

తనను కలిసిన అన్నాడీఎంకే మంత్రులకు ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తలంటారు. ప్రభుత్వ, పార్టీ పదవుల్లోనూ ఎవరికివారు పనులు చక్కబెట్టుకుంటూ తనను పట్టించుకోకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తిని వెళ్లగక

తనను కలిసిన అన్నాడీఎంకే మంత్రులకు ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తలంటారు. ప్రభుత్వ, పార్టీ పదవుల్లోనూ ఎవరికివారు పనులు చక్కబెట్టుకుంటూ తనను పట్టించుకోకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. జయలలిత అక్రమాస్తుల కేసులో జైల్లో శిక్షను అనుభవిస్తున్న తనను కలిసేందుకు వచ్చిన మంత్రులు కేఏ సెంగోట్టయ్యన్, సెల్లూరు కే రాజు, దిండిగల్ శ్రీనివాసన్‌లపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారంతా వణికిపోయారు. 
 
అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లకుండా అలసత్వం, అటు పార్టీ పదవిపై ఎన్నికల సంఘం నోటీసుకు సంజాయిషీ ఇవ్వడంలో నిర్లక్ష్యం, అధికారంలో ఉన్నామన్న మాటే గానీ జైలు నుంచి, పార్టీ పదవీగండం నుంచి నన్ను గట్టెక్కించాలన్న ధ్యాస కనీసం ఉందా? ఎవరికి వారు మీ పదవులను చక్కబెట్టుకునే పనిలో బిజీ అయిపోయారు కదూ?' అంటూ శశికళ హూంకరించడంతో ఏం చెప్పాలో అర్థంగాక మంత్రులు నోరెళ్ళబెట్టారు. 
 
మరోవైపు.. తిరుగుబాటు నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాత్రం జయలలిత మృతిపై అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించి నిజనిజాలను బహిర్గతం చేయాలంటూ డిమాండ్ చేశారు.