బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (11:00 IST)

పరప్పణ జైలు నుంచి తుముకూరు జైలుకు శశికళను మార్చండి: కుదరదన్న కోర్టు

ముఖ్యమంత్రి దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్ష పడి బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు కోర్టులో చుక్కెదురైంది.

ముఖ్యమంత్రి దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్ష పడి బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు కోర్టులో చుక్కెదురైంది. తనను పరప్పణ అగ్రహార జైలు నుంచి తుముకురూ జైలుకు మార్చాలని కోరుతూ ఆమె తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. 
 
శశికళ తరపున రామస్వామి అనే వ్యక్తి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. శశికళను తుమకూరు జైలుకు బదిలీ చేయాలని అందులో కోరారు. పరప్పణ అగ్రహార జైలు తమిళనాడు రాష్ట్రానికి సమీపంలో ఉండటంతో తరచూ తమిళ ప్రజా ప్రతినిధులు జైలుకు వెడుతుంటారని పిటిషన్‌లో పేర్కొన్నారు. జైలు నుంచే తమిళనాడు పాలనకు దిశానిర్దేశం జరుగుతోందని, కనుక తుమకూరు జైలుకు శశికళను బదిలీ చేయాలని పిటీషన్ వేశారు. 
 
దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం పిటీషనను కొట్టివేసింది. నిబంధనలకు అనుగుణంగానే ఆమెను కలిసేవారికి అనుమతులు ఉంటాయని అందరికీ అవకాశం ఉండదని కోర్టు సూచించింది. దీంతో శశికళ పరప్పన అగ్రహార జైలులోనే గడపనున్నారు.