శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (15:15 IST)

జైలులో చిన్నమ్మకు హైఫై వసతులుండవ్.. కామన్ రూమే ఇవ్వాలి: సుప్రీం కోర్టు ఆదేశాలు

దేశం మొత్తాన్ని తమిళనాడు వైపు తిరిగి చూసేలా చేసిన ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి.. అక్రమాస్తుల కేసు ద్వారా చెక్ పడింది. సుప్రీం కోర్టు శశికళను దోషిగా తేల్చినా.. అరెస్ట్ చేసిందుకు కొద్ది గడియల్లోనే చిన్న

దేశం మొత్తాన్ని తమిళనాడు వైపు తిరిగి చూసేలా చేసిన ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి.. అక్రమాస్తుల కేసు ద్వారా చెక్ పడింది. సుప్రీం కోర్టు శశికళను దోషిగా తేల్చినా.. అరెస్ట్ చేసిందుకు కొద్ది గడియల్లోనే చిన్నమ్మ చక్రం తిప్పేసింది. పన్నీరును తొలగించి పళని సామిని పైకి తెచ్చింది. అయితే దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి తర్వాత అన్నాడీఎంకే పార్టీని తన ఆధీనంలో తీసుకోవాలనుకున్న శశికళ చిప్పకూడు ఖాయమైపోయింది. 
 
అంతేగాకుండా జైలులో చిన్నమ్మకు సాధారణ వసతులే ఉంటాయి. అక్రమాస్తుల కేసులో శశికళతో పాటు ముగ్గుర్ని సుప్రీం దోషులుగా తేల్చింది. 500 పేజీలతో ఈ కేసు తీర్పు వెలువడింది. ఈ కేసుకు సంబంధం ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇంకా శశికళతో పాటు జైలుకు వెళ్ళనున్న ముగ్గురికి జైలులో ప్రత్యేక వసతులు చేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది.  
 
గతంలో దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో జైలు జీవనం గడిపినప్పుడు ఎ-కేటగిరీతో కూడిన వసతులను ఆమెకు కల్పించారు. అయితే చిన్నమ్మకు ప్రత్యేక వసతులు కల్పించకూడదని న్యాయవాదులు తెలిపారు. చిన్నమ్మకు అందరికీ ఇచ్చే కామన్ రూమే ఇవ్వాలన్నారు. ఈ తీర్పు ప్రతిలో న్యాయవాదులు తీవ్రపదజాలాన్ని ఉపయోగించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన నేరస్థులపై సుప్రీం ఫైర్ అయ్యింది.