శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ప్రీతి
Last Modified: సోమవారం, 15 అక్టోబరు 2018 (14:20 IST)

ఈ పని చేయకుంటే డిసెంబర్ ఒకటి నుండి మీ ఎస్‌బిఐ ఖాతా బంద్

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉన్నట్లయితే, నవంబర్ చివరి నాటికి బ్యాంక్ ఖాతాలో మీ మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకోవాలి. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకుంటున్నట్లయితే ఈ పని తప్పకుండా చేయాలి. నవంబర్ చివరి నాటికి మీ ఖాతాకు ఫోన్ నంబర్ అనబంధితమై లేకుంటే, డిసెంబర్ ఒకటవ తేదీ నుండి ఈ సేవలన్నింటినీ నిలిపివేయనున్నట్లు ఎస్‌బిఐ తన ఖాతాదారులకు తెలియజేసింది.
 
నెట్‌ బ్యాంకింగ్ వినియోగదారులు తమ మొబైల్ నంబర్ ఖాతాలో రిజిస్టర్ అయిందో లేదో, అలాగే ఏ నంబర్ రిజిస్టర్ అయ్యి ఉందనే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ముందుగా మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి మీ నెట్‌ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ చేయాలి. 
 
ఎంటర్ అయ్యిన తర్వాత మై అకౌంట్‌ అండ్‌ ప్రొఫైల్‌ ట్యాబ్‌కి వెళ్లి, అందులో పర్సనల్‌ డిటెయిల్స్‌/మొబైల్‌ ట్యాబ్‌ను క్లిక్‌ చేయాలి. మీ ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేసారంటే, ఇప్పటికే అందులో మొబైల్‌ నంబర్, ఇమెయిల్‌ ఐడి రిజిస్టర్‌ అయ్యి ఉంటే కనిపిస్తాయి, అదే లేనట్లయితే మీరు మీ బ్రాంచ్‌కి వెళ్లి అప్‌డేట్ చేసుకోవచ్చు.