శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 2 ఆగస్టు 2018 (21:36 IST)

జియో, ఎస్‌బీఐల డిజిట‌ల్ భాగస్వామ్యం... వినియోగదారులకు ఇవే ఉపయోగాలు...

ముంబై : జియో పేమెంట్స్ బ్యాంక్ (రిల‌య‌న్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మ‌రియు ఎస్‌బీఐల 70:30 జాయింట్ వెంచ‌ర్ సంస్థ‌) త‌న ఆవిర్భావ ప్ర‌క్రియ అనంత‌ర కార్య‌క‌లాపాల‌ను వేగ‌వంతం చేసింది. జియో మ‌రియు ఎస్‌బీఐలు సంయుక్తంగా ముందుకు సాగుతూ రాబోయే త‌రానికి సంబంధించిన

ముంబై : జియో పేమెంట్స్ బ్యాంక్ (రిల‌య‌న్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మ‌రియు ఎస్‌బీఐల 70:30 జాయింట్ వెంచ‌ర్ సంస్థ‌) త‌న ఆవిర్భావ ప్ర‌క్రియ అనంత‌ర కార్య‌క‌లాపాల‌ను వేగ‌వంతం చేసింది. జియో మ‌రియు ఎస్‌బీఐలు సంయుక్తంగా ముందుకు సాగుతూ రాబోయే త‌రానికి సంబంధించిన ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ‌లో భాగంగా డిజిట‌ల్ బ్యాంకింగ్‌, చెల్లింపులు మ‌రియు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మ‌రో కీల‌క ఒప్పందం కుదుర్చుకున్నాయి.
 
ఎస్‌బీఐకి చెందిన డిజిటల్ కస్టమర్ బేస్ ఎన్నో రెట్లు వృద్ధి చేసేందుకు జియో మరియు ఎస్‌బీఐ ఈ డిజిటల్ భాగస్వామ్య లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. విప్లవాత్మకంగానే కాకుండా సమర్థమైన సేవలకు చిరునామాగా ఎస్‌బీఐ యోనోను తీర్చిదిద్దిన సంగ‌తి తెలిసిందే. డిజిట‌ల్ బ్యాంకింగ్‌, వాణిజ్య‌ప‌ర‌మైన లావాదేవీలు, వినియోగ‌దారుల‌కు సంబంధించిన సేవ‌ల కు చెందిన ఆర్థిక స‌హాయ కార్య‌క్ర‌మాలు యోనోలో పొందుప‌ర్చారు. యోనో డిజిట‌ల్ బ్యాంకింగ్‌కు చెందిన ఫీచ‌ర్లు మ‌రియు ప‌రిష్కార సేవ‌ల‌ను మై జియో ప్లాట్‌ఫాం ద్వారా సాఫీగా మ‌రియు స‌మ‌న్వ‌యంతో అద్భుత‌మైన అనుభూతితో విని‌యోగ‌దారులు సొంతం చేసుకోవ‌చ్చు. మై జియో, భార‌త‌దేశంలోనే అతిపెద్ద ఓవ‌ర్ ది టాప్ (ఓటీటీ) ఆధారిత మొబైల్ అప్లికేష‌న్ త‌న ఆర్థిక‌ప‌ర‌మైన సేవ‌ల‌ను ఎస్‌బీఐ మ‌రియు జియో పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అంద‌జేస్తోంది.
 
జియో మ‌రియు ఎస్‌బీఐ వినియోగ‌దారుల‌కు రిల‌య‌న్స్ ద్వారా రూపొందించిన ఆర్థిక లావాదేవీలు మ‌రియు వినియోగ‌దారుల సేవ‌ల‌కు సంబంధించిన సేవ‌ల‌కు సంబంధించిన అత్యుత్త‌మ ప్లాట్‌ఫాం అయిన జియో ప్రైం ద్వారా ల‌బ్ధిపొందుతారు. జియో ప్రైమ్ ద్వారా రిల‌య‌న్స్ రిటైల్, జియో స‌హా ఇత‌ర వ్యాపార సంస్థ‌ల‌కు చెందిన ఎక్స్‌క్లూజివ్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.  దీంతోపాటుగా ఎస్‌బీఐ రివార్డ్జ్ ( ఎస్‌బీఐకి చెందిన గ‌తంలోని లాయ‌ల్టీ ప్రోగ్రామ్‌) మ‌రియు జియో ప్రైమ్ వినియోగ‌దారులు మునుపెన్న‌డూ లేని ప్ర‌యోజ‌నాలు పొందుతారు. అదన‌పు రివార్డ్ అవ‌కాశాలు మ‌రియు రిల‌య‌న్స్, జియో స‌హా ఇత‌ర ఆన్‌లైన్‌, ప్ర‌త్య‌క్ష కొనుగోలు భాగ‌స్వామ్యుల‌కు చెందిన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌గ‌లుగుతారు.
 
ఎస్‌బీఐ త‌న నెట్‌వ‌ర్క్ మ‌రియు క‌నెక్టివిటీ సొల్యూష‌న్స్‌కు సంబంధించి జియోను ప్రాధాన్య‌గ‌ల భాగ‌స్వామిగా నిర్దేశించుకుంది. ప‌ట్ట‌ణ మ‌రియు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున క‌లిగిన ఉన్న నెట్‌వ‌ర్క్ క్వాలిటీ వ‌ల్ల ఎస్‌బీఐకి వివిధ ర‌కాలైన వినియోగ‌దారుల సేవ‌లైన వీడియో బ్యాంకింగ్ స‌హా ఇత‌ర సేవ‌ల‌ను వారి ఆకాంక్ష‌కు త‌గిన‌ట్లుగా అందించేందుకు వీలు అవుతుంది. దీంతోపాటుగా ఎస్‌బీఐ వినియోగ‌దారుల‌కు జియో ఫోన్లు ప్ర‌త్యేక ఆఫ‌ర్ల‌పై ల‌భిస్తాయి.
 
ఈ ఒప్పందం సంద‌ర్భంగా ఎస్‌బీఐ చైర్మ‌న్ శ్రీ ర‌జ‌నీశ్ కుమార్ మాట్లాడుతూ ``డిజిట‌ల్ బ్యాంకింగ్‌లో భార‌త‌దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా గుర్తింపు పొంది ఉన్న మేం ప్ర‌పంచంలోనే అతిపెద్ద నెట్‌వ‌ర్క్ గుర్తింపు పొందిన జియోతో పొత్తుపెట్టుకోవ‌డం ప‌ట్ల సంతోషిస్తున్నాం. ఈ ఒప్పందం వ‌ల్ల రెండు భాగ‌స్వామ్య‌ప‌క్షాల‌కు త‌మ డిజ‌ట‌ల్ సేవ‌ల‌కు సంబంధించిన ప‌రిధిని విశేష రీతిలో విస్త‌రించుకునేందుకు అవ‌కాశం క‌లుగుతుంది మ‌రియు మా వినియోగ‌దారుల‌కు అద్భుత‌మైన సేవ‌ల అనుభూతి ద‌క్కుతుంది`` అని పేర్కొన్నారు.
 
శ్రీ ముఖేష్ డి.అంబానీ, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ చైర్మన్ మాట్లాడుతూ ``ఎస్‌బీఐ బ్యాంక్‌కు ఉన్న భారీ స్థాయిలో వినియోగ‌దారుల సంఖ్య‌ ప్ర‌పంచంలోనే మ‌రే బ్యాంక్‌కు లేదు. జియో త‌న‌కున్న సుపీరియ‌ర్ నెట్‌వ‌ర్క్‌ను, ప్లాట్‌ఫాంల‌ను రిల‌య‌న్స్ రిటైల్ ఎకోసిస్ట‌మ్‌తో డిజిట‌ల్ సేవ‌ల‌ను స్వీక‌రించి ఎస్‌బీఐ మ‌రియు జియో వినియోగ‌దారులకు సంబంధించిన ఆకాంక్ష‌ల‌కు పూర్తి స్థాయిలో నెర‌వేర్చేలా ముందుకు సాగ‌నుంది.`` అని వెల్ల‌డించారు.
 
రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ గురించిః
 
రిల‌య‌న్స్  ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్‌) భార‌త‌దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ కంపెనీ. రూ.430,731 కోట్ల ($66.1 బిలియ‌న్ల‌) ట‌ర్నోవ‌ర్‌, రూ.56,034  న‌గ‌దు లాభాలు ( $8.6 బిలియ‌న్‌), రూ. 36075 కోట్ల నెట్ ప్రాఫిట్ ($5.5 బిలియ‌న్ల‌) ను ఈ ఏడాది మార్చి 31 నాటికి పొందుప‌ర్చింది.
 
ఫార్చూన్ గ్లోబ‌ల్ 500లోని వ‌ర‌ల్డ్స్ లార్జెస్ట్ కార్పొరేష‌న్ జాబితాలో చోటు సంపాదించుకున్న భార‌త‌దేశానికి చెందిన ఏకైక ప్రైవేట్ కంపెనీ ఆర్ఐఎల్‌. ప్ర‌స్తుతం ఆదాయాల ప‌రంగా 148వ స్థానం,లాభాల ప‌రంగా 99వ స్థానంతో అత్యంత లాభ‌దాయ‌క భార‌తీయ‌ కంపెనీగా ఆ జాబితాలో చోటు సంపాదించుకుంది. 2018 ఏడాదికి ``ఫోర్బ్స్ గ్లోబ‌ల్ 2000`` ర్యాంకింగ్ విడుద‌ల చేసిన జాబితాలో 83వ స్థానం, భార‌తీయ కంపెనీల్లో మొట్ట‌మొద‌టి స్థానం కైవ‌సం చేసుకుంది. లింక్డ్ ఇన్ 2018లో విడుద‌ల చేసిన ``భార‌తీయులు ప‌నిచేయాల‌నుకుంటున్న టాప్ కంపెనీల జాబితా`లో త‌న స్థానాన్ని సొంతం చేసుకుంది. హైడ్రోకార్బ‌న్ అన్వేష‌ణ మ‌రియు ఉత్ప‌త్తి, పెట్రోలియం రిఫైనింగ్ మ‌రియు మార్కెటింగ్‌, పెట్రో కెమిక‌ల్స్, రిటైల్ మ‌రియు 4జీ రిటైల్ స‌ర్వీస్‌లో ఆర్ఐఎల్ విస్త‌రించి ఉంది.