మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (14:27 IST)

స్వలింగ సంపర్కం : కోర్కె తీర్చేందుకు నిరాకరించిన బాలికపై యువతి దాడి...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. స్వలింగ సంపర్కం చేస్తూ వచ్చిన ఓ బాలికపై మరో యువతి దాడికి పాల్పడింది. తన కోర్కె తీర్చేందుకు ఆ బాలిక నిరాకరించడంతో యువతి ఈ దారుణానికి తెగబడింది. తాజాగా వెలుగుల

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. స్వలింగ సంపర్కం చేస్తూ వచ్చిన ఓ బాలికపై మరో యువతి దాడికి పాల్పడింది. తన కోర్కె తీర్చేందుకు ఆ బాలిక నిరాకరించడంతో యువతి ఈ దారుణానికి తెగబడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లాలోని దక్షిణ్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నివశిస్తోంది. ఈ ప్రాంతానికే చెందిన మరో యువతితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ మంచి స్నేహితురాళ్ళుగా మారారు. ఆ తర్వాత వీరిద్దరూ ఒకరిపై ఒకరు లైంగికపరంగా ఆకర్షితులయ్యారు. 
 
ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ బాలికపై యువతి ఒత్తిడి తెచ్చింది. దీనికి బాలిక సమ్మతించలేదు. దీంతో కోపం పెంచుకున్న యువతి... బాలికను అంతమొందించాలని ప్లాన్ వేసింది. ఇందులోభాగంగా, ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో యాసిడ్‌తో దాడి చేసి పారిపోయింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారని పోలీసులు వెల్లడించారు. 
 
దీనిపై బాధిత బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు... బాలిక, యువతి మధ్య లైంగిక సంబంధం ఉన్నట్టు తేలింది. దీంతో యువతిని అరెస్టు చేశారు. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక ఇపుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.