శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2017 (10:26 IST)

సెక్యూరిటీ గార్డు సాహసం... ప్రాణాలకు తెగించి (వీడియో)

గోవా రాజధాని పనాజీలో ఓ సెక్యూరిటీ గార్డు తన ప్రాణాలకు తెగించి మరీ ఏటీఎం సెంటర్‌లో దోపిడీని అడ్డుకున్నాడు. ఇపుడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గోవా రాజధాని పనాజీలో ఓ సెక్యూరిటీ గార్డు తన ప్రాణాలకు తెగించి మరీ ఏటీఎం సెంటర్‌లో దోపిడీని అడ్డుకున్నాడు. ఇపుడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
పనాజీ పాంజిమ్‌ నగరంలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఏటీఎంలో శుక్రవారం ఓ ఆగంతకుడు ముసుగు ధరించి దొంగతనానికి యత్నించాడు. అది గమనించి అప్రమత్తమైన గార్డు అతన్ని అడ్డుకునేందుకు యత్నించాడు. దీంతో దొంగ తన దగ్గరున్న సుత్తెతో సెక్యూరిటీ గార్డు తలపై పదేపదే దాడి చేశాడు. ఈ పెనుగులాటలో గార్డు కిందపడిపోగా.. దొంగ చెలరేగి దెబ్బలు కొట్టాడు. 
 
గార్డు లాగేయటంతో దొంగ ముసుగు తొలగిపోగా.. ఆ కోపంతో దొంగ, గార్డుపై మరింతగా రెచ్చిపోయాడు. చివరకు సుత్తి లాక్కున్న సెక్యూరిటీ గార్డు పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు వెంటపడ్డాడు. స్థానికులు సెక్యూరిటీ గార్డును ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దొంగ వేటలో ఉన్నారు.