గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2017 (12:32 IST)

పట్టపగలే అమ్మాయిని గదిలోకి లాక్కెళ్లి...

మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే సెక్యూరిటీగార్డు ఓ అమ్మాయిని గదిలోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన పూణే నగరంలో సంచలనం సృష్టించింది. తాజాగా వెలుగులోకి వచ్చ

మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే సెక్యూరిటీగార్డు ఓ అమ్మాయిని గదిలోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన పూణే నగరంలో సంచలనం సృష్టించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహేష్ సింగ్ పురాన్‌సింగ్ (35) అనే వ్యక్తి ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో పూణే నగరానికి వలస వచ్చాడు. ఈయనకు భార్యాపిల్లలు కూడా ఉన్నారు. మహేష్ సింగ్ పూణెలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో పూణే నగరంలోని నాన్సీ టవర్స్ ముందు నుంచి పట్టపగలు 12.30 గంటల సమయంలో 20 ఏళ్ల ఓ అమ్మాయి రోడ్డుపై నడిచి వెళుతుండగా, గార్డుగా పనిచేస్తున్న మహేష్ సింగ్ ఆమె చేయి పట్టుకుని సెక్యూరిటీ గార్డు గదిలోకి లాక్కెళ్ళాడు. 
 
ఆ యువతి పెద్దగా కేకలు వేస్తున్నప్పటికీ నోరు నొక్కిపట్టి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇంత జరుగుతున్న రోడ్డుపై వెళుతున్న్ స్థానికులు చూస్తూ మిన్నకుండిపోయారేగానీ ఆ కామాంధుడిని ఆపేందుకు ఏమాత్రం ప్రయత్నించలేదు. అయితే, కొందరు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని బాధిత యువతిని రక్షించి, వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడైన గార్డు మహేప్ సింగ్‌ను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు.