ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2017 (11:32 IST)

జయలలిత కొడనాడు ఎస్టేట్ వాచ్‌మెన్ హత్య... కాలిపోయిన కీలక డాక్యుమెంట్లు.. కారణం?

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ వద్ద కాపలాగా ఉండే వాచ్‌మెన్ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఈ వాచ్‌మెన్‌ను హత్య చేసి ఉరికంబానికి వేలాడదీశారు. ఆ తర్వాత ఎస్టేట్‌లోని

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ వద్ద కాపలాగా ఉండే వాచ్‌మెన్ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఈ వాచ్‌మెన్‌ను హత్య చేసి ఉరికంబానికి వేలాడదీశారు. ఆ తర్వాత ఎస్టేట్‌లోని కొన్ని కీలక డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. 
 
సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే కొడనాడు ఎస్టేట్‌పై కొందరు భూబకాసురులు కన్నేసినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగానే, కీలకమైన డాక్యుమెంట్ల కోసం వాచ్‌మెన్‌ను హత్య చేసివుంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈ హత్యావార్త వెలుగులోకి వచ్చిన తర్వాత ఎస్టేట్‌కు చేరుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
 
ఇదిలావుంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు వేల కోట్ల రూపాయల స్థిర చరాస్తులు ఉన్నాయి. ఆమె మరణం తర్వాత కొంతమంది జయ ఆస్తులపై కన్నేశారు. జయ ఆస్తులకు వారుసులెవరనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. జయ కూడా ఎవరి పేరుతోనూ తన ఆస్తులను రాయలేదు. దీంతో శశికళ కుటుంబంతో పాటు మరికొంతమంది జయ ఆస్తులను ఆక్రమించుకునే కుట్రలకు తెరతీసినట్టుగా భావిస్తున్నారు. ఇలాంటి వారే ఈ ఎస్టేట్‌పై కూడా కన్నేసివుంటారని భావిస్తున్నారు.