1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2016 (11:17 IST)

పాకిస్థాన్ జిందాబాద్ : 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై దేశద్రోహం కేసు

పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసిన 200 మంది కార్యకర్తలపై దేశద్రోహం కేసు నమోదైంది. ఇటీవ‌ల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యూరీలో ఉగ్ర‌వాదులు చొర‌బ‌డి 18 మంది భార‌త సైనికుల‌ని హతమార్చిన విషయం తెల్సిందే.

పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసిన 200 మంది కార్యకర్తలపై దేశద్రోహం కేసు నమోదైంది. ఇటీవ‌ల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యూరీలో ఉగ్ర‌వాదులు చొర‌బ‌డి 18 మంది భార‌త సైనికుల‌ని హతమార్చిన విషయం తెల్సిందే. 
 
ఈనేపథ్యంలో వారికి నివాళిగా ఉత్తరప్రదేశ్‌లోని మోరాదాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల క్రితం భారీ ర్యాలీ కూడా నిర్వహించింది. అయితే, ర్యాలీలో సైనికులకు అవ‌మానం క‌లిగేలా పాకిస్థాన్ అనుకూల నినాదాలు వినిపించాయి. 
 
కాంగ్రెస్ జిందాబాద్, పాక్‌ జిందాబాద్ అంటూ వారు రెచ్చిపోతూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాల‌ను ఓ న్యూస్‌ ఛానల్ ప్రసారం చేయడంతో స్పందించిన‌ యూపీ పోలీసులు ఆ ర్యాలీలో పాల్గొన్న 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై దేశద్రోహం కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.