శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (17:19 IST)

అకతాయి చేష్టలు : ఇంటికి నిప్పు.. ఆరుగురి సజీవదహనం

ఓ అకతాయి చేసిన చేష్టల కారణంగా ఇంటికి నిప్పు అంటుకుని ఆరుగురు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని కొడగు జిల్లాలోని పొన్నంపేట పోలీస్టేషన్‌ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మద్యం మత్తుల్లో ఉన్న ఓ వ్యక్తి ఓ ఇంటికి తాళం వేసి నిప్పుపెట్టాడు. ఈ సమయంలో ఇంట్లో 8 మంది ఉండగా.. ముగ్గురు మంటలు అంటుకొని సజీహ దహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
 
వారిని వెంటనే మైసూర్‌లోని కేఆర్‌ హాస్పిటల్‌కు తరలించారు. ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది. 
 
ఈ ఘటన జరిగిన సమయంలో అందరూ నిద్రలో ఉన్నారు. బేబి (45), సీత (40), ప్రార్థన (6), విశ్వస్ (3), విశ్వస్ (6), ప్రకాశ్‌ (7) మృతి చెందగా.. భాగ్య (40), పాచే (60) హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సంఘటనపై పొన్నంపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.