సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (10:24 IST)

వదినను పెళ్లి చేసుకున్న మరిది.. ఎందుకో తెలుసా?

కరోనా కారణంగా భర్త మృతి చెందాడు. అప్పటికే ఆమెకు 19 నెలల కుమార్తె వుంది. ఆ మహిళ ఒంటరిగా నిలిచింది. అలాంటి పరిస్థితుల్లో తన భర్త సోదరుడే ఆమెను వివాహం చేసుకొని ఆదర్శంగా నిలిచాడు. ఈ ఘటన అహ్మద్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అహ్మద్‌నగర్ జిల్లా అకోలే తాలూకాలోని ఢోక్రీకి చెందిన నీలేష్ శేటే 2021 ఆగస్టు 14న కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. అతను రెసిడెన్షియల్ పాఠశాలలో ఉద్యోగం చేసేవాడు. కరోనా బారినపడి కోలుకుంటున్న సమయంలోనే.. మెదడులో కణితి ఏర్పడింది.
 
నాసిక్​లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిరోజులకే ప్రాణాలు కోల్పోయాడు. అతనికి 19 నెలల కుమార్తె, భార్య పూనమ్ ఉన్నారు. ఇప్పుడు నీలేష్​ సోదరుడే పూనమ్​ను పెళ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచాడు. వీరిని పలువురు ప్రశంసించారు.