సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2016 (17:17 IST)

షీనా బోరా హత్య కేసు : ఇంద్రాణి ముఖర్జియాకు కోర్టులో చుక్కెదురు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియాకు కోర్టులో చుక్కెదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. కన్నబిడ్డ షీనా బోరా హత్య క

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియాకు కోర్టులో చుక్కెదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. కన్నబిడ్డ షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియాను ముంబై పోలీసులు అరెస్టు చేసి జైల్లో బంధించారు. 
 
ఈ నేపథ్యంలో ఇంద్రాణి ముఖర్జియా తండ్రి ఇటీవల మరణించారు. తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గౌహతి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె వేసిన మధ్యంత బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. గౌహతికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేమని... కావాలంటే పోలీసుల భద్రత మధ్య ముంబైలో అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని సూచన చేసింది. 
 
అంతేకాదు, మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయరాదని షరతు విధించింది. 2012లో షీనాబోరాను హత్యచేసి, రాయఘడ్ అడవుల్లో పాతిపెట్టిన సంగతి తెలిసిందే. ఇదే కేసుకు సంబంధించి ఆమె మూడో భర్త పీటర్ ముఖర్జియా కూడా జైల్లో ఉన్నారు. ఈ కేసులో ఇంద్రాణి ముఖర్జియా ప్రధాన నిందితురాలిగా ఉన్న విషయం తెల్సిందే.