సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 8 జులై 2022 (21:29 IST)

ఆధ్యాత్మికతను ఆరాధించేవారు షింజో: శ్రీశ్రీ రవిశంకర్

Gurudev-Shinzo
కర్టెసి-ట్విట్టర్
దుండగుడి కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతిపై పండిట్ శ్రీశ్రీ రవిశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు.

 
''ఒక నిజాయితీ గల అన్వేషకుడు, ఆధ్యాత్మికతను ఆరాధించేవారు షింజో. తన భార్యతో కలిసి క్రమం తప్పకుండా ధ్యానం, సుదర్శన్ క్రియ సాధన చేసేవారు. దశాబ్దానికి పైగా మాతో అనుబంధం కలిగి ఉన్నారు. పురాతన- ఆధునికతను కలపడానికి ప్రయత్నించారు. ఆయన ఆచరణాత్మక నాయకత్వం గుర్తుండిపోతుంది.'' అన్నారు శ్రీశ్రీ రవిశంకర్