మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 జులై 2022 (19:11 IST)

అక్రమ సంబంధానికి అడ్డు.. తమ్ముడి తల నరికిన అక్క

murder
అక్రమ సంబంధాల కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయి.  తాజాగా తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే అక్కసుతో తమ్ముడినే పొట్టనబెట్టుకుంది ఓ అక్క. ఈ సంఘటన కర్ణాటకలోని హుబ్బలి సిటీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. శంభూలింగకు 18 ఏళ్ల కిందట.. బసవ్వతో వివాహం జరిగింది. పెళ్లి అయినప్పటి నుంచి వారు అన్యోన్యంగా వున్నారు. అయితే.. గత ఆరు నెలలుగా.. బసవ్వ అడ్డ దారులు తొక్కుతోంది.
 
అదే ఊరుకు చెందిన భోపాల్‌ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే.. ఈ విషయం బసవ్వ భర్త అయిన శంభూలింగకు తెలిసింది. అయితే.. పరువు పోతుందనే నేపంతో.. వారిని ఏం అనలేకపోయాడు. కానీ తమ్ముడి ఇందుకు అంగీకరించలేదు. ఆమెను మందలించాడు. 
 
అయితే తమ్ముడిపై కక్ష్య పెంచుకున్న బసవ్వ ప్రియుడు భోపాల్‌తో కలిసి.. హత్య చేసింది . కత్తితో తల నరికి చంపారు. దీంతో ఎంటర్‌ అయిన పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.