గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 మార్చి 2017 (14:23 IST)

"స్టాప్ లవ్ అండర్ అంబరెల్లా" డ్రైవ్‌లో లవర్స్‌కు చుక్కలు చూపిన శివసేన నేతలు (Video)

ఇటీవలి కాలంలో ప్రేమికులు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి కారణం ప్రాశ్చాత్య సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంఘ్ పరివార్, శివసేన, హిందూముణ్ణని వంటి సంస్థలకు చెందిన నేతలు చేస్తున

ఇటీవలి కాలంలో ప్రేమికులు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి కారణం ప్రాశ్చాత్య సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంఘ్ పరివార్, శివసేన, హిందూముణ్ణని వంటి సంస్థలకు చెందిన నేతలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఫలితంగా ప్రార్కులు, బీచ్‌లలో కనిపించే ప్రేమికులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్‌లో శివసేన కొందరు శివసేన నేతలు ప్రేమికులపై తమ ప్రతాపం చూపించారు. 
 
‘‘స్టాప్ లవ్ అండర్ అంబరెల్లా’’ డ్రైవ్ పేరుతో చేతిలో ప్లకార్డులను పట్టుకుని పార్కుల్లో, బీచ్‌ల వెంట కనిపించిన ప్రేమ జంటలను బెంబేలెత్తించారు. లవర్స్ కనిపిస్తే చాలు శివసేన కార్యకర్తలు పరుగులు పెట్టించారు. కేవలం లవర్సే కాదు మోడ్రన్ దుస్తులు ధరించి రోడ్డుపై కనిపించిన అమ్మాయిలను వదల్లేదు. వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ నానా హంగామా చేశారు. మహిళా దినోత్సవం జరుపుకోవడాన్ని కూడా శివసేన కార్యకర్తలు తప్పుబట్టారు. రోడ్డు పక్కన కనిపించిన ప్రేమికులను అసభ్య పదజాలంతో దూషించారు.
 
కొందరైతే మరీ రెచ్చిపోయి లవర్స్‌పై చేయి చేసుకున్నారు కూడా. ఈ వ్యవహారమంతా పోలీసుల సమక్షంలోనే జరగడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్‌లో వైరల్ అవడంతో ఉన్నతాధికారులు స్పందించారు. దీంతో ఎస్‌ఐను సస్పెండ్ చేశారు. శివసేన కార్యకర్తలను నిలువరించడంలో విఫలమైన 8 మంది కానిస్టేబుల్స్‌పై బదిలీ వేటు వేశారు. ఆరుగురు శివసేన కార్యకర్తలపై పబ్లిక్ న్యూసెన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.