శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 1 మే 2019 (14:16 IST)

రావణుడు పుట్టిన దేశంలో బుర్ఖాలపై నిషేధం.. రాముడు పుట్టిన దేశంలో....?

మహారాష్ట్రలో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న శివసేన పార్టీ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఈస్టర్ డే వరుస పేలుళ్ళ తర్వాత శ్రీలంక ప్రభుత్వం బుర్ఖ ధారణపై నిషేధం విధించింది. దీన్ని ప్రస్తావించిన శివసేన.. భారత్‌లోనూ బుర్ఖా ధారణపై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. 
 
దేశంలో ట్రిపుల్ తలాక్ విషయంలో నిర్ణయం తీసుకున్నట్టుగానే బుర్ఖాలను ధరించే విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని కోరింది. ముఖ్యంగా, రావణుడు పుట్టిన దేశంలో బుర్ఖాలపై నిషేధం విధించగా, శ్రీరాముడు పుట్టిన దేశంలో వీటిపై నిషేధం విధిస్తే ఏంటటా అంటూ ఘాటుగా ప్రశ్నించింది. 
 
ఈస్టర్ డే రోజున జరిగిన వరుస పేలుళ్ళ దృష్ట్యా శ్రీలంక ప్రభుత్వం బుర్ఖాలను, స్కార్ఫ్‌లను ధరించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని శివసేన తన పార్టీ పత్రిక సామ్నాలో ప్రధానంగా ప్రస్తావించింది. భద్రతా చర్యల్లో భాగంగా దీన్ని అత్యవసరంగా చేపట్టాలని కోరింది. ముఖాలను కప్పి ఉంచే వస్త్రాలు, బుర్ఖాల వల్ల జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపింది. అందువల్ల సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్టుగానే ధైర్యంగా బుర్ఖాలపై నిషేధం విధించాలని శివసేన కోరింది.