బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 30 జూన్ 2018 (17:22 IST)

రేపిస్టులు భూమికే భారం : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

అభంశుభం తెలియని చిన్నారులు, యువతులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే కామాంధులు భూమికే భారమని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇలాంటి మానవమృగాలకు జీవించే హక్కు లేదని ఆ

అభంశుభం తెలియని చిన్నారులు, యువతులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే కామాంధులు భూమికే భారమని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇలాంటి మానవమృగాలకు జీవించే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు.
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాందసౌర్‌లో ఎనిమిదేళ్ల చిన్నారిని ఓ నిందితుడు అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై సీఎం స్పందిస్తూ, మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాలకు జీవించే హక్కు లేదని, అటువంటి వ్యక్తులు భూమికే భారమన్నారు. 
 
బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వ పర్యవేక్షణలో చిన్నారికి చికిత్స అందిస్తున్నామని, ఆమె కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, కఠినశిక్ష పడేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.