శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2016 (11:29 IST)

రాకాసి అమ్మ.. 18 నెలల చిన్నారిని నేలకేసి విసిరికొట్టింది.. చెప్పు తీసి ఎడాపెడా బాదేసింది.. (వీడియో)

తల్లిగా తన పిల్లలలు లాలించాల్సిందిపోయి.. ఆ రాకాసి అమ్మ కర్కశంగా ప్రవర్తించింది. ప్రేమను పంచాల్సిన ఆమె తన మూడేళ్ల చిన్నారి పట్ల దారుణంగా ప్రవర్తించింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే

తల్లిగా తన పిల్లలలు లాలించాల్సిందిపోయి.. ఆ రాకాసి అమ్మ కర్కశంగా ప్రవర్తించింది. ప్రేమను పంచాల్సిన ఆమె తన మూడేళ్ల చిన్నారి పట్ల దారుణంగా ప్రవర్తించింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన షబ్నం అనే మహిళ తన 18 నెలల చిన్నారిని చిత్రహింసలు పెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది.
 
ఆ చిన్నారిని నేలకేసి విసిరికొట్టడమే కాకుండా.. తన కాలి చెప్పు తీసి ఎడాపెడా బాదింది. ఈ సంఘటన చూసిన పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ సంఘటన వీడియోకి చిక్కడంతో సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్‌గా మారింది. 
 
ఈ విషయం తెలుసుకున్న షబ్నం అత్తమామలు ఈ మేరకు ఢిల్లీ కమిషన్ ఆఫ్ ఉమెన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ కమిషన్ ఆఫ్ ఉమెన్.. షబ్నంను అదుపులోకి తీసుకున్నారు. ఆమె మానసిక స్థితిపై వైద్య పరీక్షలు చేస్తున్నామని వారు చెప్పారు.