గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2024 (17:28 IST)

విరుదునగర్‌ హైవేపై బోల్తా పడిన కారు.. ఆరుగురు మృతి

Car accident
Car accident
తమిళనాడు విరుదునగర్‌లో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విరుదునగర్-మదురై హైవేపై తిరుమంగళం సమీపంలోని శివకోట్టై వద్ద టూవీలర్‌ను వేగంగా వస్తున్న ఎస్‌యూవీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
మదురైలోని విల్లాపురంకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా ఐదుగురు వ్యక్తులు మరణించారని మదురై జిల్లా ఎస్పీ అరవింద్ తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. మధురై విల్లాపురం ప్రాంతానికి చెందిన కుటుంబీకులు గుడికి వెళ్ళి తిరిగి మదురైకి వస్తుండగా.. శివక్కోటై ప్రాంతంలో రోడ్డుకు అడ్డంగా టూవీలర్‌ వచ్చింది. దీంతో అదుపుకోల్పోయిన కారు టూవీలర్‌ను ఢీకొట్టి ఆమడదూరంలో బోల్తా పడింది. 
 
ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిని శివాత్మిక (10), కనకవేల్ (61), కృష్ణకుమారి (58), పాండి (48), నాగజ్యోతి (45) ప్రాణాలు కోల్పోయారు. పాండి అనే వ్యక్తి టూవీలర్ నడిపిన వాడని తేలింది. ఇంకా అదే కారులో ప్రయాణించిన రత్నసామి, మీన, శివశ్రీ, కారు డ్రైవర్ మణికండన్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఇందులో శివశ్రీ అనే ఎనిమిదేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స ఫలించక ప్రాణాలు విడిచింది. తద్వారా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది.