సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 4 ఏప్రియల్ 2024 (10:47 IST)

ఐదుగురిపై దాడి చేసిన చిరుత: పట్టుకునేందుకు యత్నిస్తే చేయి కొరుకుతూ...(Video)

leopard
శ్రీనగర్ లోని గండేర్‌బల్‌లో బుధవారం చిరుతపులి దాడిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు వన్యప్రాణి శాఖ అధికారులతో సహా ఐదుగురు గాయపడ్డారు. అయితే చిరుతపులిని అధికారులు సజీవంగా పట్టుకున్నారు. ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించి సంబంధిత శాఖకు సమాచారం అందించారు. దీంతో పెద్దఎత్తున వేట ప్రారంభించామని అధికారి తెలిపారు.
 
సెర్చ్ ఆపరేషన్‌లో చిరుతపులి దాడి చేయడంతో ఇద్దరు మహిళలు, ముగ్గురు వన్యప్రాణి అధికారులు గాయపడ్డారని అధికారి తెలిపారు. తీవ్ర ప్రయత్నాల అనంతరం వన్యప్రాణి అధికారులు చిరుతను సజీవంగా పట్టుకున్నారు. ఆ సమయంలో చిరుత వారిపై దూకుతూ దాడి చేసింది. ఐతే ఎంతో ధైర్యసాహసాలతో అటవీశాఖ సిబ్బంది చిరుతపై ఎలాంటి మారణాయుధాలు ఉపయోగంచకుండా దాని దాడిని ఎదుర్కొంటూ పట్టుకున్నారు.
 
చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని వైద్యాలయానికి తరలించారు.