టిక్కెట్ చూపించమన్న టీటీఈ... రైలు నుంచి కిందికి తోసేసిన ప్రయాణికుడు!!
జనరల్ టిక్కెట్‌తో స్లీపర్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికుని వద్ద టిక్కెట్ చూపించమన్నందుకు ఓ టీటీఈ ప్రాణాలు కోల్పోయాడు. ఆ టీటీఈని ప్రయాణికుడు రైలు నుంచి కిందకు తోసేశాడు. దీంతో టీటీఈ రైలు పట్టాలపై పడటంతో మరో ట్రాక్‌పై వేగంగా వచ్చిన రైలు.. అతన్ని ఢీకొట్టి అతనిపై దూసుకెళ్లింది. దీంతో టీటీఈ శరీరం ముక్కలైంది. ఇతర ప్రయాణికులు నిందితుడుని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ షాకింగ్ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఎర్నాకుళం నుంచి పాట్నా వెళుతున్న సూపర్ ఫాస్ట్ రైలులో వి.వినోద్ (47) అనే వ్యక్తి టీటీఈగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో స్లీపర్ క్లాస్‌లో ప్రయాణికుల టిక్కెట్లు తనికీ చేస్తుండగా రజినీకాంత్ అనే ప్రయాణికుడు జనరల్ టిక్కెట్ కొనుగోలు చేసి స్పీపర్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నాడు. దీంతో ఫైన్ కట్టాలని రజినీకాంత్‌కు టీటీఈ కోరడంతో వారిద్దరి మధ్య గొడవ చెలరేగింది. ఈ క్రమంలో డోర్ వద్ద ఉన్న టీటీఈ వినోద్‌ను రజినీకాంత్ బయటకు తోసేశాడు. వేగంగా వెళుతున్న రైలులో నుంచి టీటీఈ వినోద్ పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాడు.
అదేసమయంలో ఆ ట్రాక్‌పై వేగంగా దూసుకొస్తున్న మరో రైలు వినోద్‌ను ఢీకొట్టడమే కాకుండా, అతనిపై నుంచి రైలు దూసుకెళ్లింది. దీంతో టీటీఈ శరీరం రెండు ముక్కలైంది. ఆ షాకింగ్ ఘటన చూసి నివ్వెర పోయిన ఇతర ప్రయాణికులు రజినీకాంత్ ప్రయాణికుడుని పట్టుకుని చితకబాది.. పక్క స్టేషన్‌లో పోలీసులకు అప్పగించారు. ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో రైలు సిబ్బంది, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వినోద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.