శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

దుమ్ము రేపిన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు

దేశ ఆర్థిక వ్యవస్థ మందగించిందని ప్రజలతో పాటు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపె నీలు మాత్రం దీపావళి సంబరాలను ముందే జరుపుకుంటున్నాయి.

ఈ పండుగ సీజన్‌ ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌ లైన్‌లో మిలి యన్‌ల కొద్ది స్మార్ట్‌ఫోన్లను విక్రయించుకున్నాయి. కంపెనీలు కూడా ఒక దానితో ఒకటి పోటీ పడి ఆకర్షణీయమైన ఆఫర్లతో పాటు డిస్కౌంట్లను ఆఫర్‌ చేశాయి. ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు అమె జాన్‌ డాట్‌ ఇన్‌లో 15 రెట్లు పెరిగాయి.

శ్యాంసంగ్‌, వన్‌ఫ్లస్‌, ఆపిల్‌, షామి, వైవోలున్నాయి. వన్‌ఫ్లస్‌ రికార్డుస్థాయిలో రూ.700 కోట్ల అమ్మకాలు జరిపితే శ్యాంసంగ్‌ అమ్మకాలు ఏకంగా ఐదు రెట్లు పెరిగాయి. శ్యాంసంగ్‌కు చెందిన ఎం సిరీస్‌తో పాటు శ్యాం సంగ్‌ ఏ సిరీస్‌, శ్యాంసంగ్‌ నోట్‌ 9 ఫోన్లకు మంచి డిమాండ్‌ లభిం చింది.

గతేడాది గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌తో పోల్చుకుంటే ఈ ఏడాది మొబైల్‌ ఫోన్లు అత్యధికంగా అమ్ముడపోయాయి. గతేడాదితో పోల్చు కుంటే బ్రాండెడ్‌ ఫోన్ల అమ్మకాలు రెండు రెట్లు పుంజుకున్నాయి.
 
ఈ-కామర్స్‌ కంపెనీ స్నాప్‌డీల్‌ గతేడాది దీపావళీ సేల్స్‌తో పోల్చుకొంటే ఈ ఏడాది 52 శాతం అమ్మకాలు పెరిగాయని సోమవా రం ఒక ప్రకటనలో తెలి పింది. స్నాప్‌డీల్‌ దీపా వళి సేల్స్‌ పేరిట సెప్టెం బర్‌ 28 నుంచి అక్టోబర్‌ 6 వరకు అమ్మకాలు ప్రారంభించింది.

ఒక వారంలోనే తమ ప్లాట్‌ఫాంపై 76 మిలియన్‌ యూజర్‌లు విచ్చేశారని పేర్కొంది. ఈ ఏడాది దీపావళి అమ్మకాల్లో రికార్డు స్థాయిలో ఆర్డర్లు దక్కాయని తెలి పింది. స్నాప్‌డీల్‌కు వచ్చిన ప్రతి పది ఆర్డర్లలో తొమ్మిది ఆర్డర్లు నాన్‌ మెట్రోనగరాల నుంచి ఉదాహర ణకు విజయవాడ, నాగపూర్‌, సూరత్‌, చండీ గఢ్‌, పానాజీ, జంషెడ్‌పూర్‌, షివ్లూ, గువా హతిల నుంచి వచ్చినట్లు స్నాప్‌డీల్‌ ఒక ప్రక టనలో వెల్లడించింది.

ఈ నగరాల నుంచి ఆర్డర్లు గత ఏడాదితో పోల్చుకుంటే నాలుగు రెట్లు పెరిగాయని తెలిపింది. దేశం లోని 120 నగరాలు, పట్టణాల నుంచి గతేడాదితో పోల్చుకుంటే అమ్మకాలు రెండు రెట్లు పెరిగాయి. ఆ పట్టణాలు ఇలా ఉన్నాయి.

దక్షిణాదిన ఖమ్మం, హసన్‌, మిర్యాల గూడ, భీమవరం, పశ్చమ భారత్‌లో సతారా, ఆనంద్‌, బరూచ్‌.. పాలీ, ఉత్తర భార తంలో మాలేర్‌కోట్లా, రూర్కీ, జాన్సీ మరియు హరిద్వార్‌, తూర్పున హజారీబాగ్‌, రాణిగంజ్‌, పారాదీప్‌, ఈశాన్య ప్రాంతాల్లో తేజ్‌పూర్‌, ఇటాన గర్‌, మాజు లీలున్నట్లు స్నాప్‌ డీల్‌ వివరించింది.

గత వారం అమెజాన్‌ ఇం డియా ఒక ప్రకట నలో ఈ పండుగ సీజన్‌లో గత ఏడాదితో పోల్చుకుంటే అమ్మ కాలు 3 రెట్లు పెరిగా యని తెలిపింది. ముఖ్యంగా నాన్‌ మెట్రో కస్టమర్ల నుంచి ఆర్డర్లు ఎక్కువగా వచ్చా యని.. సుమారు 15వేల పిన్‌కోడ్‌ల నుంచి కస్ట మర్లు తమ ప్రైమ్‌ ప్రో గ్రాంలో చేరారని, గతేడాదితో పోల్చు కుంటే ఈ ఏడాది చిన్న పట్టణాల నుంచి 69 శాతం మంది ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెట్టారని తెలిపింది.