మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2019 (13:09 IST)

అన్నం తినకుండా మారాం చేసిన చిన్నారి.. కొట్టి చంపేసిన తల్లి

అన్నం తినకుండా మారాం చేసిన నాలుగేళ్ల చిన్నారి మారాం చేసిందని.. కన్నతల్లి ఆ బిడ్డను చంపేసింది. ఈ ఘటన కేరళలోని కొల్లంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొల్లం ప్రాంతానికి చెందిన నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళ, తన బిడ్డకు నిమోనియా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి తిరిగి వచ్చింది. 
 
కానీ ఇంటికొచ్చిన చిన్నారి ఆహారం వద్దని మారాం చేసింది. ఎంత నచ్చజెప్పినా ఆహారం తీసుకోలేదు. దీంతో ఆవేశానికి గురైన మహిళ బిడ్డపై చేజేసుకుంది. తల్లి కొట్టడంతో చిన్నారి స్పృహ తప్పింది. దీన్ని చూసిన బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ బిడ్డను పరిశోధించిన వైద్యులు చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. ఇక బంధువులు బిడ్డపై చేజేసుకున్న తల్లిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.