శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 అక్టోబరు 2019 (13:26 IST)

స్పా ముసుగులో వ్యభిచారం.. వాట్సాప్ ద్వారా విటులను..?

ఆగస్టు చివరి వారంలో విశాఖపట్నంలొ ఓ హోటల్‌లో వెలుగుచూసిన సెక్స్ రాకెట్ బాగోతం సోషల్ మీడియాను ఎలా వాడేస్తున్నారో తెలపడానికి నిదర్శనంలా మారింది. హోటల్ గదుల బుకింగ్ నుంచి అమ్మాయిలను సెలెక్ట్ చేసుకునే వరకు అంతా ఆన్‌లైన్‌ వ్యవహారమే నడిపించారు బ్రోకర్లు. చివరకు విషయం కాస్తా బయటకు పొక్కడంతో సీన్ రివర్సైంది. పోలీసుల ఎంట్రీతో సెక్స్ రాకెట్ బాగోతం బయటపడింది.
 
తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టైంది. వాట్సాప్ వేదికగా అమ్మాయిల ఫోటోలు షేర్ చేస్తూ విటులను ఆకర్షిస్తున్న సెక్స్ రాకెట్ బండారం వెలుగు చూసింది. ఒక మహిళ ప్రధాన సూత్రధారిగా సాగుతున్న ఈ తతంగం చివరకు పోలీసుల కంట పడింది.
 
ఘజియాబాద్‌లో స్పా సెంటర్లు సెక్స్ వర్కర్లకు అడ్డాగా మారాయి. అందులో వ్యభిచారం యధేచ్ఛగా సాగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు అటాక్ చేశారు. ఈ దాడుల్లో 9 మంది యువతులు పట్టుబడటం గమనార్హం. 
 
విటులు, నిర్వాహకులు అంతా కలిపి మొత్తం 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా ఉన్న మహిళ కేవలం వాట్సాప్ ద్వారా ఈ దందా సాగిస్తుండటం పోలీసులను విస్మయానికి గురి చేసింది.