గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2024 (20:17 IST)

తలకిందుకు దిండులా మారిన పాము.. ఉలిక్కిపడిన వ్యక్తి ఎక్కడ?

snake
snake
పాములకు సంబంధించిన వీడియోలు నిత్యం నెట్టింట చక్కర్ల కొడుతూనే ఉంటాయి. తాజాగా ఓ గుడి ముందు గల చెట్టుకింద హాయిగా పడుకుని నిద్రించిన వ్యక్తి తలకిందకు దూరింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో కేరళకు చెందినదిగా తెలిసింది.
 
కొడంగల్లూర్‌లోని శ్రీకురుంబ భగవతి టెంపుల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. చెట్టు కింద సేద తీరుతూ గాఢ నిద్రలో ఉండగా ఓ పాము అక్కడికి వచ్చింది. అతడు పడుకున్న అరుగు పైకి ఎక్కి.. అతడి తల కింద నుంచి పాకుతూ వెళ్లింది. 
 
పాము తాకగానే ఉలిక్కిపడి పైకి లేచి కంగుతిన్నాడు. తీరా పామును చూసి భయంతో పైకి లేచి పక్కకు పరుగులు తీశాడు. అయితే పాము మాత్రం అతడికి ఎలాంటి హానీ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.