1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (10:42 IST)

మంచు గడ్డల కింద ఆరు రోజులు : ప్రాణాలతో బయపడిన సియాచిన్‌ జవాన్‌

సుమారు 25 అడుగుల మేరకు పేరుకుపోయిన మంచు గడ్డల కింద ఆరు రోజుల పాటు ఉన్న ఓ సియాచిన్ జవాన్ ప్రాణాలతో బతికి బయపడ్డారు. ఆ సైనికుడు పేరు కర్ణాటకకు చెందిన లాన్స్‌నాయక్‌ హనుమంతప్ప. అవలాంచ్‌లో ఇరుక్కున్న సైనికుల కోసం సైన్యం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా మంచును తొలగిస్తుండగా హనుమంతప్ప కనిపించాడు. 
 
అతడింకా ప్రాణాలతోనే ఉన్నాడని గుర్తించి ఆస్పత్రికి తరలించినట్టు లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ హుడా తెలిపారు. కాగా, హిమపాతానికి గురైన మిగతా తొమ్మిది మందిలో ఐదుగురి మృతదేహాలు దొరికాయని, వారిలో నలుగురి వివరాలు తెలిశాయని హుడా వివరించారు.