బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (15:58 IST)

రాజ్యసభకు సోనియా గాంధీ.. రాజస్థాన్ రాష్ట్రం నామినేషన్

sonia gandhi
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమె బుధవారం కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్ నుంచి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆ పార్టీ సీనియర్ మహిళా నేత రేణుకా చౌదరి, బీహార్ నుంచి అఖిలేష్ యాదవ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ హండొరేలు పోటీ చేస్తారని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయించారని, ఆ పార్టీ ప్రధాన కార్యద్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. 
 
కాగా, నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు బుధవారం సోనియా గాంధీ జైపూర్‌‍కు చేరుకున్నారు. ఆమె వెంట వెంట రాహుల్‌,  ప్రియాంక కూడా ఉన్నారు. విమానాశ్రయంలో వారికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ స్వాగతం పలికారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. ఈ ఎన్నికతో తొలిసారి ఆమె పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం ఆమె యూపీలోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయడంలేదు.  
 
కాగా, రాజస్థాన్‌ నుంచి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఒకటి కాంగ్రెస్‌కు దక్కనుంది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే రెండో నేతగా సోనియా నిలవబోతున్నారు. 1964 ఆగస్టు నుంచి 1967 ఫిబ్రవరి వరకూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ.. పెద్దల సభ సభ్యురాలిగా ఉన్నారు.