గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 15 మే 2017 (15:54 IST)

అయోధ్య నిర్మాణానికి రూ.15 కోట్ల విరాళం.. ముస్లిం ఎమ్మెల్సీ ఆఫర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్య నిర్మాణానికి ఓ ముస్లిం ఎమ్మెల్సీ భారీ మొత్తంలో విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. రామాలయం నిర్మాణానికి రూ.15 కోట్లు దానంగా ఇస్తానని సమాజ్‌వాదీ పార్టీకి చెందిన బుక్కల్ నవ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్య నిర్మాణానికి ఓ ముస్లిం ఎమ్మెల్సీ భారీ మొత్తంలో విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. రామాలయం నిర్మాణానికి రూ.15 కోట్లు దానంగా ఇస్తానని సమాజ్‌వాదీ పార్టీకి చెందిన బుక్కల్ నవాబ్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన లక్నోలో మీడియాతో మాట్లాడుతూ తాను కోల్పోయిన భూమికి నష్టపరిహారంగా ప్రభుత్వం నుంచి డబ్బు రావాల్సివుందని, అందులో నుంచే తాను దేవాలయం నిర్మాణం నిమిత్తం విరాళం ఇస్తానని చెప్పారు. 
 
శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించారని నమ్ముతున్నందున అక్కడ గుడి ఉండి తీరాలని అన్నారు. కాగా, బుక్కల్‌కు ప్రభుత్వం నుంచి రూ.30 కోట్ల వరకూ నష్ట పరిహారం వస్తుందని అంచనా.  
 
కాగా, కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంతో అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలంటూ డిమాండ్లు పుట్టుకొస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు ముస్లిం ఎమ్మెల్యే కూడా గొంతుకలపడం గమనార్హం.