శుక్రవారం, 7 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 అక్టోబరు 2016 (15:08 IST)

ఆ దుష్టశక్తుల వల్లే సమాజ్‌వాదీ పార్టీలో కలకలం : ఆజంఖాన్

సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలపై ఆ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ స్పందించారు. ఆయన ఆదివారం లక్నోలో మీడియాతో మాట్లాడుతూ... 'కొన్ని దుష్టశక్తులు పార్టీని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించినప్

సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలపై ఆ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ స్పందించారు. ఆయన ఆదివారం లక్నోలో మీడియాతో మాట్లాడుతూ... 'కొన్ని దుష్టశక్తులు పార్టీని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఇలాంటి పరిణామాలు తప్పవు. వాళ్లు మళ్లీ పార్టీలోకి అడుగు పెట్టినప్పుడే ఇలాంటి రోజొకటి వస్తుందని ఊహించా' అని ఆయన పరోక్షంగా పార్టీలోకి మళ్లీ వచ్చిన సీనియర్ నేత అమర్ సింగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, యూపీ కేబినెట్ నుంచి నలుగురు మంత్రులను ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తొలగించడంపై ఆజంఖాన్ స్పందిస్తూ... కేబినెట్‌లో ఎవరు ఉండాలి, ఎవర్ని తొలగించాలనేది ముఖ్యమంత్రి ఇష్టమని, ఆమేరకు అఖిలేష్ వ్యవహరించారని ఆజం ఖాన్ అన్నారు. 
 
అమర్ సింగ్ పునరాగమనంతో సమాజ్ వాదీ పార్టీలో మొదలైన అంతర్గతపోరులో ములాయం సింగ్ యాదవ్ ప్రియ సహోదరుడు శివపాల్ యాదవ్ ఒకవైపు ఉండిపోగా, సీఎం అఖిలేష్ యాదవ్, ములాయం మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్ మరోవైపునకు చేరారు. రెండు వర్గాలకు మధ్య సమన్వయం చేసేందుకు నేతాజీ ములాయం చేసిన ప్రయత్నాలన్ని బెడిసికొట్టడం చివరికి మంత్రుల ఉద్వాసనకు దారితీసింది.