శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 జులై 2017 (18:20 IST)

పార్లమెంట్ క్యాంటీన్‍‌ పొంగల్‌లో స్పైడర్...

పార్లమెంట్ క్యాంటీన్‍‌లోని ఆహారం తీసుకున్న అధికారి శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. పొంగల్‌లో సాలీడు ఉన్నట్లు గుర్తించి క్యాంటీన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. లోక్‌సభ రిపోర్టింగ్ బ

పార్లమెంట్ క్యాంటీన్‍‌లోని ఆహారం తీసుకున్న అధికారి శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. పొంగల్‌లో సాలీడు ఉన్నట్లు గుర్తించి క్యాంటీన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. లోక్‌సభ రిపోర్టింగ్ బ్రాంచ్‌కు చెందిన అధికారి శ్రీనివాస్ బుధవారం క్యాంటిన్‌కు వెళ్లారు. అక్కడ ఆయన పొంగలితో పాటు పెరుగన్నంకు ఆర్డరిచ్చాడు. పొంగలి కొంచెం తినగానే ఆయన అస్వస్థతకు గురయ్యారు. 
 
పొంగల్‌లో సాలీడు ఉన్నట్టు ఆపై తేలింది. సాలీడు పడిన పొంగలి తిన్న శ్రీనివాస్ వాంతులు చేశారని.. ఆ ఆహారంలో సాలీడు వున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఫుడ్ పాయిజన్ కావడంతో ఆస్పత్రిలో శ్రీనివాస్ చికిత్స తీసుకున్నారని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు.