మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (14:59 IST)

కుక్క తోక వంకర.. ముఫ్తీ తీరూ అంతే.. ఆమెకు టెర్రరిస్టులతో లింకుంది: సుబ్రహ్మణ్య స్వామి

జూలై 8న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ జరిగినప్పటి నుంచి కాశ్మీరులో అల్లర్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జమ్మూ-క

జూలై 8న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ జరిగినప్పటి నుంచి కాశ్మీరులో అల్లర్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జమ్మూ-కశ్మీరులో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీపై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి సెటైర్లు విసిరారు. మెహబూబాను కుక్క తోకతో ఆయన పోల్చారు. కుక్కతోక వంకరగా ఉంటుందని, దానిని మార్చలేమని స్వామి ఓ ఇంటర్వ్యూలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
కాశ్మీర్‌లో ముఫ్తీకి బదులుగా రాష్ట్రపతి పాలన ఉండాలి. ఆమె కుక్క తోక వంటిది. దానిని చక్కదిద్దడం సాధ్యం కాదని చెప్పారు. గతం నుంచి ఆమెకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని, ఆమె మారుతారనుకొని బీజేపీ ఆమె పార్టీతో పొత్తు పెట్టుకుందన్నారు.