శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 జూన్ 2017 (12:41 IST)

స్వామీ.. నోరు అదుపులో పెట్టుకో... చెన్నై హిజ్రాలను మళ్లిస్తాం : రజనీ ఫ్యాన్స్ వార్నింగ్

భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామికి సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. స్వామి.. నోరు అదుపులో పెట్టుకోవాలని లేనిపక్షంలో చెన్నై హిజ్రాలను మళ్లించాల్సి

భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామికి సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. స్వామి.. నోరు అదుపులో పెట్టుకోవాలని లేనిపక్షంలో చెన్నై హిజ్రాలను మళ్లించాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. రజనీ రాజకీయరంగ ప్రవేశంపై తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న వేళ 'రజనీకాంత్ పిరికి వాడని, నిర్ణయాలు తీసుకోలేడని, పైగా, ఆయన ఓ ఆర్థిక మోసగాడంటూ సుబ్రహ్మణ్య స్వామి తాజాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రజనీ అభిమానులు మండిపడుతున్నారు. 
 
ఇక రజనీ రాజకీయ ప్రవేశం తథ్యం అని తేలిన నేపథ్యంలో మరోసారి ఆయన రజనీకాంత్ ఆర్థిక నేరగాడు.. రాజకీయాల్లోకి రాకూడదంటూ విమర్శలు చేయడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. సుబ్రహ్మణ్య స్వామిపై ట్విట్టర్ దాడి మొదలుపెట్టారు. తమ నాయకుడిపై ఉన్న అభిమానం, ఆయన ఆదేశాలు తమను కట్టిపడేస్తున్నాయని, ఆయన చిన్న మాట చెబితే తమ ప్రతాపం చూపేవాళ్లమంటూ ట్వీట్లపై ట్వీట్లు చేస్తున్నారు. 
 
ఇంకొందరు స్పందిస్తూ.. గతంలో మద్రాసు హైకోర్టు సమీపంలో చెన్నై హిజ్రాల చేతిలో స్వామికి ఎదురైన గుణపాఠాన్ని ఓసారి గుర్తు తెచ్చుకుని తన వైఖరిని మార్చుకోవాలని లేనిపక్షంలో ఇదే సంఘటన పునరావృతమవుతుందని మరో అభిమాని పేర్కొన్నాడు. 
 
ఇంకో అభిమాని స్పందిస్తూ, ఢిల్లీలో కూర్చుని ఎవరిపై పడితే వాళ్లపై ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. రాజకీయాల్లో సీనియర్‌గా ఉంటూ ఇవేం నీచ రాజకీయాలు? అని ఒక అభిమాని హితవు పలికారు. తమ అభిమాన హీరో వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు.