శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2022 (12:17 IST)

జస్టిస్ ఎన్వీ రమణ లాస్ట్ వర్కింగ్ డే... ల్యాండ్‌మార్క్ జడ్జిమెంట్

nv ramana
తెలుగుతేజం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తన చివరి పనిదిన విధులను నిర్వహిస్తున్నారు. ఈ చివరి రోజున చరిత్రలో నిలిచిపోయే కేసుల్లో తీర్పునిచ్చారు. తన చివరి రోజు విధి నిర్వహణలో ఆయన ఐదు కీలక తీర్పులను వెలువరించారు. ఈ తీర్పుల ప్రొసీడింగ్స్‌ను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పించారు. ఇలా సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్‌ను తొలిసారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశ ప్రజలు వీక్షించే అవకాశం కల్పించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించాడు. 
 
అలాగే చివరి రోజున ఆయన వెలువరించనున్న కీలక తీర్పుల్లో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత పథకాల కేసు ఒకటి. ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఇష్టానుసారంగా ఉచిత హామీలు, పథకాలను ప్రకటిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసేందుకు ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నాయి. 
 
ఈ రుణాల్లో రవ్వంత సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేసి మిగిలిన సొమ్మును తమ జేబుల్లో వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ ఉచిత పథకాలపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. జస్టిస్ రమణ కూడా ఈ ఉచిత పథకాలపై పలుమార్లు తన అభిప్రాయంతో పాటు ఆందోళనను కూడా వ్యక్తం చేశారు. 
 
తాజాగా ఉచిత పథకాలపై ఆయన సారథ్యంలోని ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. ఈ ఉచితాలపై సమీక్ష చేసేందుకు సుప్రంకోర్టు ఒక త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటుచేసింది. అఖిలపక్షం, నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం సూచించింది. అలాగే, గత 2013లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. 
 
ఈ త్రిసభ్య ధర్మాసనాన్ని కొత్త సీజేఐ యుయు లలిత్ ఏర్పాటు చేస్తారని తెలిపుతూ ఈ ఉచితాల కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఉచితాలపై ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసి ప్రజా ప్రయోజనాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చిన న్యాయవాదులకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో ఎన్వీ రమణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.