శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (06:43 IST)

తీర్పు వెలువడగానే బోరుమన్న శశికళ... నేలపైనే దిగాలుగా కుప్పకూలింది...

జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ బోరుల విలపించారు. తీర్పు వార్తలను టీవీలో ఫ్లాష్ న్యూస్ రూపంలో చూడగానే ఆమె నేలగా దిగాలుగా కుప్పకూలిపోయ

జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ బోరుల విలపించారు. తీర్పు వార్తలను టీవీలో ఫ్లాష్ న్యూస్ రూపంలో చూడగానే ఆమె నేలగా దిగాలుగా కుప్పకూలిపోయారు. అలా అర్థగంట సేపు కూర్చూండిపోయారు. ఆ సమయంలో ఆమెను ఓదార్చేందుకు ఏ ఒక్క నేత సాహసం చేయలేదు. 
 
తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో భేటీ కోసం సోమవారం సాయంత్రం కూవత్తూరులోని రిసార్టుకు వెళ్లిన శశికళ.. రాత్రికి అక్కడే బస చేశారు. మంగళవారం ఉదయం అల్పాహారం తీసుకుని మహిళా ఎమ్మెల్యేలతో కలిసి టీవీ ముందు కూర్చున్నారు. తనకు శిక్ష పడినట్లు తెలియగానే ఐదు నిమిషాలకు పైగానే భోరున విలపించారు.
 
ఆ తర్వాత అరగంటపాటు దిగాలుగా నేలపైనే ఆమె కూర్చుండిపోయారు. ఆ తర్వాత తేరుకుని తన వర్గ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో తన స్థానంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పలువురి పేర్లు పరిశీలించినప్పటికీ.. తనకు కుడిభుజంలా వ్యహరించే ఎడప్పాడి పళనిస్వామిని సీఎంగా ఎంపిక చేశారు. 
 
ఆ తర్వాత మంగళవారం రాత్రి 10 గంటలకు రిసార్టు నుంచి పోయెస్ గార్డెన్‌కు బయలుదేరేముందు ఎమ్మెల్యేలనుద్దేశించి శశికళ చివరిసారిగా ప్రసంగించారు. జరుగుతున్న కుట్రలు, వాటి వెనుక ఉన్న నేతలెవ్వరన్నది ఎమ్మెల్యేలంతా గ్రహించే ఉంటారని, అందరూ ఐకమత్యంగా ఉండి పార్టీని కాపాడుకోవాలని సూచించారు. తనకు శిక్ష పడినా, ‘అమ్మ’ ఈ బాధల నుంచి తప్పించుకున్నందుకు ఆనందంగా ఉందని భావోద్వేగానికి గురయ్యారు. పది నిమిషాల ప్రసంగంలో ఆమె నాలుగుమార్లు కన్నీటిపర్యంతమయ్యారు.