సోమవారం, 30 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2016 (13:31 IST)

స్వాతిది పరువు హత్యా? బిలాల్‌ని స్వాతి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందా? బాబాయే హత్యకు కారణమా?

స్వాతిది పరువు హత్యా..? బాబాయ్‌నే హత్యకు కారణమా? రామ్‌కుమార్ హంతకుడు కాదా? వంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే... పోలీసులు నోరువిప్పాల్సిందే. పోలీసులు ఈ కేసుకు సంబంధించి రామ్ కుమార్ హంతకుడని అరెస్ట్ చేసి

స్వాతిది పరువు హత్యా..? బాబాయ్‌నే హత్యకు కారణమా? రామ్‌కుమార్ హంతకుడు కాదా? వంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే... పోలీసులు నోరువిప్పాల్సిందే. పోలీసులు ఈ కేసుకు సంబంధించి రామ్ కుమార్ హంతకుడని అరెస్ట్ చేసిన నేపథ్యంలో... చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో దారుణంగా హత్యకు గురైన స్వాతి హత్యపై ఫేస్ బుక్‌లో పలు రకాలైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
స్వాతి హత్యపై తమిళచ్చి అనే ఫేస్ బుక్ అకౌంట్ నుంచి పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా రామ్ కుమార్ స్వాతి హత్య కేసులో నిందితుడు కాదని.. అసలు నిందితుడికి ఆమె బాబాయ్ ఇంట్లో ఆశ్రయం కల్పించాడనే వార్త సంచలనం సృష్టించింది. రామ్‌కుమార్ స్వాతిని హత్య చేయలేదని, నిందితుడు ముత్తుకుమార్ అనే వ్యక్తికి స్వాతి బాబాయ్ ఆశ్రయం కల్పించినట్లు ఫేస్ బుక్ అకౌంట్లో పేర్కొనబడింది.
 
దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నట్లు కూడా తమిళచ్చి వెల్లడించింది. గతంలో స్వాతి తండ్రి ఆమెకు సొంత తండ్రి కాదని సెన్సేషనల్ సృష్టించింది. స్వాతి ముస్లిం అతనిని పెళ్ళాడేందుకు సుముఖంగా ఉండటంతో బ్రాహ్మణ అమ్మాయి, ముస్లిం వ్యక్తిని పెళ్లాడితే పరువుపోతుందనే ఉద్దేశంతో బాబాయ్ స్వాతిని హతమార్చేందుకు సర్వం సిద్ధం చేశాడని తమిళచ్చి తన ఫేస్ బుక్ అకౌంట్లో పేర్కొంది.  
 
స్వాతి బిలాల్‌ను పెళ్లాడేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గలేదని, కుటుంబీకులకు తెలియకుండానే రిజస్టర్ మ్యారేజ్ కూడా చేసేసుకుందని.. ఆ తర్వాతే బెంగళూరు నుంచి ఆమెను బలవంతంగా చెన్నైకి రప్పించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే స్వాతి బాబాయ్ అయిన సంతాన గోపాలకృష్ణన్.. ఓ ముఠాతో స్వాతిని హత్య చేసేందుకు ప్లాన్ చేశాడని.. ఈ ప్లాన్‌లో అనవసరంగా రామ్ కుమార్ ఇరుక్కుపోయాడని తమిళచ్చి ఫేస్ బుక్‌లో వెల్లడించింది.  
 
నిజానికి స్వాతిని హతమార్చిన వ్యక్తిపేరు ముత్తుకుమార్. ప్రస్తుతం తంజావూరులోని స్వాతి బాబాయ్ ఆధీనంలో అతడున్నాడు. ఇంకా స్వాతి హత్య కేసులో నలుగురి ప్రమేయం ఉందని తమిళచ్చి వెల్లడించింది. ఒకవేళ స్వాతి బాబాయ్ తనపై కేసు పెడితే.. దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇందుకు సంతాన గోపాల కృష్ణన్ రెడీగా ఉన్నారా అంటూ సవాలు విసిరింది. 
 
ఇంకేముంది.. స్వాతి హత్య కేసుతో తమిళ మీడియాకు మంచి మేత దొరికింది. ఈ కేసులో అసలు నిందితుడు ఎవరు.. కేసులోని నిజాలేంటి.. అనేదానిపై పోలీసులు నోరెత్తకపోవడంతో.. రోజుకో వార్త పుట్టుకొస్తుంది. ఇంతకీ స్వాతి హత్యకు నిజమైన కారణం ఏంటనేది ఇప్పటికీ ప్రజలకు తెలియరాలేదు.

ఇకపోతే..స్వాతి హత్య కేసులో పట్టుబడిన రామ్ కుమార్ ప్రస్తుతం పుళల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జైలులో రామ్ కుమార్ ఉన్న గదిలో వీడియో తీసేందుకు అనుమతివ్వాలని పోలీసు శాఖ చేసిన విజ్ఞప్తికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిందితుడున్న ప్రాంతంలో వీడియోగ్రాఫింగ్ ప్రోసెస్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది.