గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (12:51 IST)

16 యేళ్ళ బాలికపై 76 యేళ్ల వృద్ధ పారిశ్రామికవేత్త అత్యాచారం

కామాంధుల ఆగడాలకు హద్దేలేకుండా పోతోంది. తాజాగా ఓ ముక్కుపచ్చలారని బాలిక బలైపోయింది. 16 యేళ్ళ బాలిక 76 యేళ్ల వృద్ధ పారిశ్రామికవేత్త చేతిలో అత్యాచారానికి గురైంది. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని ఆత్తూరుకు సమీపంలో ఉన్న ఉడయార్ పాళెంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉడయార్ పాళెంకు చెందిన నటరాజ్ (76) అనే వ్యక్తి ధనవంతుడు. పైగా, స్థానికంగా ఓ పారిశ్రామికవేత్త. ఆయన ఇంట్లో అదే ప్రాంతానికి చెందిన 35 యేళ్ల మహిళ వంటపని చేస్తోంది. ఈమెకు తోడుగా 16 యేళ్ళ వయస్సున్న మేనకోడలు వరుస అయిన ఓ బాలిక పని చేస్తోంది. 
 
ఈ బాలికపై కన్నేసిన నటరాజన్... ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేశాడు. ఈ విధంగా పలుమార్లు తన లైంగిక కామవాంఛ తీర్చుకుంటూ వచ్చాడు. అయితే, ఇటీవల ఆ బాలిక తీవ్ర అస్వస్థతకు లోనైంది. దీంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ ఆ బాలికను పరీక్షించిన వైద్యులు... పలుమార్లు అత్యాచారానికి గురైనట్టు తేల్చారు. దీంతో బాలికను కుటుంబ సభ్యులు నిలదీయగా అసలు విషయం చెప్పింది. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి వృద్ధ పారిశ్రామికవేత్తను అరెస్టు చేశారు.