మంగళవారం, 1 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 6 సెప్టెంబరు 2014 (09:49 IST)

జూనియర్ ఆర్టిస్ట్ ప్రిన్స్ హత్య కేసులో తమిళ నటి శృతి అరెస్టు!

తమిళ జూనియర్ నటుడు రేనాల్డ్ పీటర్ ప్రిన్స్ హత్య కేసులో తమిళ నటి శ్రుతి అలియాస్ శృతి చంద్రలేఖను బెంగళూరులో చెన్నై పోలీసులు శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు నెల్లై జిల్లాకు చెందిన రేనాల్డ్ పీటర్ ప్రిన్స్ (36) చెన్నై శివారు ప్రాంతమైన మాధవరంలో ఉంటూ.. కంప్యూటర్ సెంటర్లు, ఆన్‌లైన్ వ్యాపారంతో పాటు.. వడ్డీ వ్యాపారం చేస్తూ వచ్చారు. ఈ వ్యాపారాల్లో బాగా డబ్బు సంపాదించండంతో పలు సినీ నటులకు రుణం ఇస్తూనే, అనేక తమిళ చిత్రాలకు కూడా ఫైనాన్స్ చేస్తూ వచ్చాడు. దీంతో రెండు చిత్రాల్లో కూడా నటించాడు. ఈ క్రమంలో శృతికి ప్రిన్స్‌కు మధ్య పరిచయం ఏర్పడింది. ఇది మరింత సన్నిహితంగా మారడంతో వారిద్దరూ మదురవాయల్‌లో ఒక ఫ్లాట్ తీసుకుని సహజీవనం చేస్తూ వచ్చారు. 
 
ఈ క్రమలో ప్రిన్స్ వద్ద ఉన్న డబ్బుతో పాటు ఆస్తిని కాజేయాలని నటి శృతి కుట్ర పన్నింది. ఇందుకోసం ప్రిన్స్ చేతిలో మోసపోయిన నెల్లై జిల్లాకు చెందిన ఉమాచంద్రన్ అనే బాధితుడితో పరిచయం పెంచుకుని హత్యకు కుట్రపన్నింది. ఈ హత్యను జనవరి నెలలో ప్రిన్స్‌ను తాము నివశిస్తున్న ఫ్లాట్‌లోనే విషపు సూదితో వేసి చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని నెల్లై జిల్లా పాలయంకోట్టై, ఐఓబీ కాలనీ సమయంలో పాతిపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రిన్స్ సోదరుడు తన అన్న కనిపిండం లేదంటూ పాలయంకోట్టై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు మొదలైంది. అయితే, ప్రిన్స్‌కు చెందిన లగ్జరీ కారును కొనుగోలు చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు ఆరా తీయగా ఉమాచంద్రన్ అనే వ్యక్తి పేరును చెప్పాడు. 
 
దీంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం వ్యవహారం బయపడింది. ఈ విషయం తెలుసుకున్న శృతి తన స్నేహితుడు ప్రిన్స్ కనిపించడం లేదంటూ మదురవాయల్ పోలీసులకు ఫిర్యాదు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఉమాచంద్రన్‌ను పోలీసులు తనదైనశైలిలో విచారించగా అసలు మొత్తం గుట్టు విప్పాడు. దీంతో శృతిని అరెస్టు చేసేందుకు మదురవాయల్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయగా ఈ బృందం దర్యాప్తులో శృతి బెంగుళూరులో ఉన్నట్టు తెలుసుకున్న పక్కా సమాచారంతో శుక్రవారం అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు. దీంతో జూనియర్ ఆర్టిస్ట్ ప్రిన్స్ హత్య కేసులో ఎనిమిది నెలలుగా ఉన్న మిస్టరీ విడిపోయింది.