గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

నమ్మిన వ్యక్తే నట్టేట ముంచాడు.. మత్తు కలిపి సామూహిక అత్యాచారం

తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ఓ మొబల్ షాపులో పనిచేసే ఓ యువతిని ఆ షాపులో పని చేసే మరో వ్యక్తి నమ్మించి మోసం చేశారు. కూల్‌డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. దీన్నే సేవించిన ఆ యువతి మత్తులోకి జారుకోగానే మరో నలుగురితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
కాంచీపురంలో రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత యువతికి 20 ఏళ్లు. ఓ సెల్‌ఫోన్‌ షాపులో పనిచేస్తోంది. గురువారం తనకు పరిచయస్తుడైన గుణశీలన్‌ అనే యువకుడిని ఆమె కలిసింది. తెలియకుండా మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ను అతడు ఇవ్వడంతో తాగేసింది. 
 
వెంటనే స్పృహ కోల్పోవడంతో గుణశీలన్‌, మరో నలుగురు స్నేహితులు దారుణానికి తెగబడ్డారు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన బాధితురాలు వారిని ప్రతిఘటిస్తూ కాపాడండంటూ కేకలు వేసింది. ఆమె అరుపులు విని రోడ్డుపై వాహనదారులు ఆ కారును వెంబడించారు. భయపడిపోయిన నిందితులు ఆమెను కారులోంచి తోసేసి పరారయ్యారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.