సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 20 జనవరి 2019 (11:04 IST)

తాత - అవ్వల వద్ద ఉంటున్న బాలికపై అత్యాచారం... మృతశిశువును జన్మించి మృతి

తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కోట జిల్లాలోని ఊతంక్కరై పుదూర్ సమీపంలో 17 యేళ్ళ బాలికపై 27 యేళ్ళ యువకుడు పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారు. చివరకు ఆ బాలిక మృతశిశువుకు జన్మనిచ్చి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఊతంక్కరై పుదూర్ గ్రామానికి చెందిన 17 యేళ్ళ బాలిక స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటూ తాత - అవ్వల వద్ద నివశిస్తోంది. ఈ  బాలికపై అదే గ్రామానికి చెందిన 27 యేళ్ల యువకుడు ఒకడు కన్నేశాడు. ఆ బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. 
 
ఆ తర్వాత బాలికపై పదేపదే అత్యాచారం చేయసాగాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయాన్ని తాత అవ్వలకు తెలియకుండా ఆ బాలిక దాచిపెట్టింది. అయితే, ఆమె ఆరోగ్యం క్షీణించసాగడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు... బాలిక గర్భంతో ఉన్నట్టు తేల్చారు. ఆ తర్వాత ఆమెకు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆ బాలిక మృతశిశువుకు జన్మనిచ్చి ప్రాణాలు విడిచింది. దీంతో మృతురాలి తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తమిళరసన్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.