తల తెగనరికి పోలీస్ స్టేషనులో విసిరేశారు...(video)
తమిళనాడులో బుధవారం రాత్రి దారుణ సంఘటన జరిగింది. పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో 17 ఏళ్ల యువకుడిని దారుణంగా హతమార్చి అతడి తలను మొండెం నుంచి వేరు చేశారు. అనంతరం బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కడలూరు పోలీస్ స్టేషన్ గేటు ముందు ఆగి అతడి తలను లోపలికి విసిరేశ
తమిళనాడులో బుధవారం రాత్రి దారుణ సంఘటన జరిగింది. పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో 17 ఏళ్ల యువకుడిని దారుణంగా హతమార్చి అతడి తలను మొండెం నుంచి వేరు చేశారు. అనంతరం బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కడలూరు పోలీస్ స్టేషన్ గేటు ముందు ఆగి అతడి తలను లోపలికి విసిరేశారు.
ఈ దృశ్యం సీసీ టీవీ ఫూటేజ్‌లో రికార్డయింది. కాగా పుదుచ్చేరిలోని ఓ సరసు పక్కన పోలీస్ స్టేషన్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో ఆ యువకుడిని హతమార్చినట్టు గుర్తించారు. దొంగతనాలకు పాల్పడే ముఠా ఈ ఘాతుకానికి పాల్పడి వుంటుందని పోలీసులు చెపుతున్నారు.