ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2016 (08:43 IST)

పోర్టులపై పాక్ నుంచి ఉగ్రదాడులు... జడ్జీలు, విదేశీ టూరిస్టుల హత్యకు కుట్ర

భారత్ ఆర్మీ నిర్వహించిన సర్జికల్ దాడుల తర్వాత ఇండో - పాక్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఇంకా నెలకొనివుంది. ముఖ్యంగా సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునే పనిలో పాకిస్థాన్ నిమగ్నమైవుంది. ఇందులోభాగంగా ఉగ

భారత్ ఆర్మీ నిర్వహించిన సర్జికల్ దాడుల తర్వాత ఇండో - పాక్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఇంకా నెలకొనివుంది. ముఖ్యంగా సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునే పనిలో పాకిస్థాన్ నిమగ్నమైవుంది. ఇందులోభాగంగా ఉగ్రవాద సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో భారత్‌లోని పోర్టులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు తెగబడేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దేశంలోని 21 పోర్టుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 
 
ఇదిలావుండగా, ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్న ఐఎస్‌ ఉగ్రవాది సుభాని హాజా మొయిద్దీన్‌.. కేరళలో కొందరు జడ్జిలను, విదేశీ టూరిస్టులు లక్ష్యంగా దాడులకు ప్రణాళిక రచించాడని దర్యాప్తులో తేలింది. తిరునెల్వేలికి చెందిన సుభాని హాజా మొయిద్దీన్‌ అనే ఐఎస్‌ ఉగ్రవాదిని ఎన్‌ఐఏ బుధవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 
 
ఐఎస్‌ తరపున యుద్ధం కోసం ఇరాక్‌లోని మోసుల్‌లో శిక్షణపొందిన ఏకైక భారతీయుడు మొయిద్దీనేనని విచారణలో వెల్లడైంది. ఎన్‌ఐఏ తెలిపిన వివరాల ప్రకారం.. సామాజిక మాధ్యమాల ద్వారా ఐఎస్‌ పట్ల ఆకర్షితుడైన మొయిద్దీన్‌.. 'ఉమ్‌రాహ్' నిర్వహించేందుకు చైన్నై నుంచి గత ఏడాది ఇస్తాంబుల్‌ వెళ్లాడు. అక్కడి నుంచి మోసుల్‌ చేరుకుని సునిశిత శిక్షణ పొందాడు. ఆపై రెండు వారాలపాటు జరిగిన యుద్ధంలోనూ పాల్గొన్నాడు.