సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 10 అక్టోబరు 2021 (22:07 IST)

తాజివాస్ హిమానీనదం వేగంగా కరిగిపోతుందట..!

జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తాజివాస్ హిమానీనదం అత్యంత వేగంగా కరుగుతుంది. ఇటీవల చాలా మార్పులు కనిపించాయని, హిమపాతం వేగంగా తగ్గిపోతున్నదని సోన్‌మార్గ్‌లోని టూరిస్ట్‌ గైడ్‌ బిలాల్‌ అహ్మద్‌ తెలిపారు. 
 
20 ఏండ్ల కింద తాజివాస్ పర్వతాలపై మంచు పలకలు చాలా మేరకు విస్తరించి ఉండేవని, సోన్‌మార్గ్‌ నుంచి కాలి నడకతోనే ఆ మంచు కొండల అందాలు పర్యాటకులకు కనువిందు చేసేవని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఈ మంచు శిఖరాన్ని చూసేందుకు కొన్ని కిలోమీటర్ల వరకు పర్యాటకులు నడవాల్సి వస్తున్నదని ఆ గైడ్‌ తెలిపారు.
 
కాగా, తాజివాస్ హిమానీనదం అత్యంత వేగంగా కరుగడానికి గ్లోబల్ వార్మింగ్ ముఖ్య కారణమని పర్యావరణ శాస్త్ర విద్యార్థి నదియా రషీద్ తెలిపారు. అక్టోబర్‌ నెలలో కూడా జూలై మాదిరిగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయని చెప్పారు. పగటి ఉష్ణోగ్రతలు పెరుగడమే దీనికి కారణమని అన్నారు.