శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 15 జులై 2019 (19:52 IST)

అమ్మో దెయ్యం.. హాస్టల్ ఖాళీ చేస్తున్న విద్యార్థులు.. ఎక్కడ?

దెయ్యం భయంతో హాస్టల్‌లో వుంటున్న విద్యార్థులు ఖాళీ చేసి పారిపోతున్నారు. ఈ ఘటన ఏపీలో కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏపీ, కర్నూలు జిల్లాలోని ఓ మోడల్ స్కూల్‌లో దెయ్యముందంటూ విద్యార్థులు జడుసుకుంటున్నారు. ప్రభుత్వ ఆధీనంలోని ఈ స్కూల్, హాస్టల్ ప్రాంతాల్లో దెయ్యం సంచరిస్తుందని.. విద్యార్థినులు వాపోతున్నారు. 
 
ఈ మోడల్ స్కూల్‌లో చేరే విద్యార్థులు తప్పనిసరిగా హాస్టల్‌లో చేరాల్సిందే. ఈ క్రమంలో వంద మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో హాస్టల్‌లు రకరకాల శబ్ధాలు వినవస్తున్నాయని విద్యార్థులు చెప్తున్నారు. అదీ రాత్రి పూట వినిపించే శబ్ధాలకు విద్యార్థినులు జడుసుకుంటున్నారు. 
 
ఈ విషయాన్ని తల్లిదండ్రులతో విద్యార్థులు తెలపడం ద్వారా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీరిలో కొంతమంది విద్యార్థినులు హాస్టల్ ఖాళీ చేసుకుని ఇంటికి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఈ స్కూల్ మొత్తం ఖాళీ అయిపోయిందని.. విద్యార్థినులకు ఎంత నచ్చజెప్పినా దెయ్యం భయంతో విద్యార్థులు ఆ పాఠశాలకు దూరమయ్యారని వార్తలు వస్తున్నాయి.