మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (08:24 IST)

భారీగా పెరిగిన బంగారం ధర

బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. కొనేవారు కరువైనా బంగారం మాత్రం వెనుదిరిగి చూడడంలేదు.  బుధవారం బంగారం సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది.

హైదరాబాద్‌ మార్కెట్లో తులం మేలిమి (24క్యారెట్లు) బంగారం రూ.58,000కు చేరువైంది. ఒక్కరోజే రూ.1,010 పెరిగి రూ.57,820కి చేరుకుంది. 22 క్యారెట్ల రేటు రూ.930 పెరుగుదలతో రూ.53,010కి ఎగబాకింది. వెండి రేటు భారీగా పెరిగి రూ.70,000 మైలురాయిని దాటేసింది. ఒక్కరోజే రూ.6,450 ఎగబాకి రూ.71,500కు చేరుకుంది.

అంతర్జాతీయంగా ధరల పెరుగుదలే ఇందుకు కారణం. ఇంటర్నేషనల్‌ కమోడిటీ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ తొలిసారిగా 2,000 డాలర్ల మార్క్‌ను అధిగమించింది. ఒక దశలో 2,060 డాలర్ల వద్ద ట్రేడైంది. ఔన్స్‌ వెండి రేటు 27.20 డాలర్ల వరకూ పెరిగింది.