ఆ మామిడి ధర 1000 రూపాయలు
అందరూ ఎంతగానో ఇష్టపడే నోరూరించే మామిడి పండు ధర మహా అయితే ఒకటి 20 రూపాయలు ఉంటుంది. అపురూపంగా లభించే కొన్ని రకాల పండ్లు అయితే కాస్త ఎక్కువ ఉంటుందేమో. కానీ మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో మాత్రమే పండే ఓ మామిడి పండు ధర మాత్రం ఆకాశాన్ని అంటుతుంది.
ఈ మామిడి ఒక్కోటి దాదాపు 1000 రూపాయలు పలుకుంతుంది. వినడానికి ఇది ఆశ్చర్యంగానే ఉంటుంది. అయితే, ఇది ముమ్మాటికీ నిజం.. స్థానికులు నూర్జహాన్గా పిలిచే ఈ మామిడి పండు ఒక్కోటి 500 నుంచి 1000 రూపాయల దాకా పలుకుతోందని అక్కడి రైతులు చెప్తున్నారు.
ఈ ఏడాది దిగుబడి బాగా ఉండడంతో పాటుగా పండు సైజు కూడా పెద్దదిగా ఉండడమే ఇంత ధర పలకడానికి కారణమట. అఫ్ఘానిస్థాన్ ప్రాంతానికి చెందిన ఈ నూర్జహాన్ మామిడిని గుజరాత్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న అలీరాజ్‌పూర్ జిల్లా కత్తివాడ ప్రాంతంలో మాత్రమే సాగు చేస్తారు...
ఈ పండు ఒక్కోటి రూ. 500 నుంచి రూ.1000 దాకా ధర పలుకుతుంది. ఈ పండ్లకు ఇప్పటికే బుకింగ్ కూడా జరిగిపోయింది. మధ్యప్రదేశ్‌తో పాటు పొరుగున ఉండే గుజరాత్‌కు చెందిన ఈ పండ్లను ఇష్టపడే వారు ముందుగా వీటిని బుక్ చేసుకున్నారు.
ఈ సారి ఒక్కో నూర్జహాన్ మామిడి పండు బరువు 2 నుంచి మూడున్నర కిలోల దాకా ఉంది. కాగా, ఈ సారి పంట బాగా ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా వ్యాపారం దెబ్బతిందని రైతులు దిగాలుగా ఉన్నారు. గత ఏడాది వాతావరణం సరిగా లేకపోవడంతో నూర్జహాన్ చెట్లు సరిగా పూత పూయలేదు. జనవరి నెలలో పూతకు వచ్చే ఈ రకం జూన్ నెలలో మార్కేట్లోకి వస్తాయి.